భారత్‌లో 33లక్షలు దాటిన కరోనా కేసులు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 Aug 2020 5:34 AM GMT
భారత్‌లో 33లక్షలు దాటిన కరోనా కేసులు

భారత్‌లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24గంటల్లో భారత్‌లో 75,760 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 1023 మంది మృత్యువాత పడ్డారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 33,10,235కి చేరింది. మొత్తం నమోదు అయిన కేసుల్లో 25,23,772 మంది కోలుకోగా.. 7,25,991 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ మహమ్మారి బారిన పడి ఇప్పటి వరకు 60,472 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 76శాతంగా ఉండగా.. మరణాల రేటు 1.8శాతంగా ఉంది.

కాగా దేశంలో నమోదైన మొత్తం కేసులలో యాక్టివ్ కేసుల శాతం 21.93గా ఉంది. దేశ వ్యాప్తంగా కరోనా పరీక్షలు బారీగా చేపట్టడంతో పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోందని కేంద్ర ఆరోగ్యశాఖ అభిప్రాయపడింది. బుధవారం దేశ వ్యాప్తంగా 9,24,998 శాంపిళ్లను పరీక్షించినట్లు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్‌) వెల్లడించింది. ఇప్పటి వరకు దేశంలో 3,85,76,510 కరోనా పరీక్షలు పూర్తి చేసినట్లు వివరించింది.

ఇక ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అవుతున్న దేశాల్లో 60 లక్షల కేసులతో అమెరికా మొదటి స్థానంలో ఉండగా.. 37లక్షల కేసులతో బ్రెజిల్‌ రెండో స్థానంలో ఉండగా.. భారత్‌ మూడో స్థానంలో కొనసాగుతోంది. దేశంలో కరోనా మహమ్మారి ఉద్దృతి ఇలాగే కొనసాగితే.. తొందరలోనే భారత్‌ రెండో స్థానానికి చేరుకోనుంది.

Next Story