తమిళనాడులో లాక్‌డౌన్ పొడిగింపు
By సుభాష్
తమిళనాడు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 1 నుంచి అన్‌లాక్ 4.0 అమలు కానుండటంతో తమిళనాడు మాత్రం సెప్టెంబర్ 30 వరకూ లాక్‌డౌన్ పొడిగించాలని నిర్ణయం తీసుకుంది. కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో వ్యాప్తిస్తుండటంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించారు. దీంతో ఇతర రాష్ట్రాల నుంచి తమిళనాడుకు వచ్చే వాళ్లకు ఈ-పాస్ తప్పనిసరి అయింది. జిల్లాల మధ్య ప్రయాణాలకు నిర్ణయించిన ఈపాస్ విధానాన్ని తమిళనాడు ప్రభుత్వం రద్దు చేసింది.
ఇదీ చదవండి: భారత్‌లో కరోనా మరణాలు తక్కువ ఉండడానికి కారణం ఇదేనట..!
కాగా, తమిళనాడులో కరోనా ఉధృతి ఏ మాత్రం తగ్గడం లేదు. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. రోజుకు వేలల్లో కేసులు నమోదవుతున్నాయి. శనివారం కూడా కొత్తగా 6.352 పాజిటివ్ కేసులు నమోదు కాగా, కొత్తగా 87 మంది మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం కేసుల సంఖ్య 4,15,590కి చేరింది. ఇందులో 3,55,727 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా, మరో 52,726 కేసులు యాక్టివ్‌లో ఉన్నాయి. శనివారం వరకు ఆ రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య7,137కు చేరింది. కాగా, శనివారం ఒక్క రోజే చెన్నైలో 1285 కేసులు నమోదు కాగా, మొత్తం కేసుల సంఖ్య 1,33,173కు చేరుకుంది. ఇలా రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండటంతో లాక్‌డౌన్ పొడిగించేందుకు నిర్ణయం తీసుకుంది.
ఇదీ చదవండి: 7 నుంచి మెట్రో పరుగులు.. అన్‌లాక్ 4.0 మార్గదర్శకాలు విడుదల