గవర్నర్‌కు కరోనా పాజిటివ్
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 2 Aug 2020 12:29 PM GMT
తమిళనాడు గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్‌కు కొవిడ్-19 పాజిటివ్ నిర్థారణ అచ్చింది. కరోనా లక్షణాలు కనిపించడంతో గత నెల 29 నుంచి హోం క్వారంటైన్ లో ఉన్న భన్వరీలాల్ పురోహిత్.. ఆదివారం కావేరీ ఆసుపత్రిలో చేరారు. కొద్ది రోజుల క్రితం తమిళనాడు రాజ్ భవన్ సిబ్బందిలో 84 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.
ఈ క్రమంలోనే గవర్నర్ గత నెల 29 నుంచి హోం క్వారంటైన్ అయ్యారు. అయితే ఇవాళ గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ లో కరోనా లక్షణాలు కనపడటంతో వెంటనే కావేరీ ఆస్పత్రిలో చేరి ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. ఇదిలావుంటే తమిళనాడు రాష్ట్రంలో 246000పైగా కేసులు నమోదవ్వగా.. 184000 కోలుకుని డిచ్చార్జ్ అవగా.. మహమ్మారి బారినపడి 3935మంది ప్రాణాలు కోల్పోయారు.
Next Story