మహారాష్ట్రలో రాజకీయ చదరంగం కొనసాగుతోంది. అధికారం చేపట్టడానికి శివసేన, బీజేపీలు తమ పావులను వేగంగా కదుపుతున్నాయి. అధికార ప్రతిష్టంభన నేపథ్యంలో సోమవారం రోజున ఢిల్లీలో ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో భేటీ అయ్యారు.

తాజా రాజకీయ పరిస్థితిపై సుమారు 30 నిమిషాలకు పైగా పాటు చర్చించారు. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వ ఏర్పాటు విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని.. ప్రస్తుత పరిస్థితులను గమనిస్తున్నామని తెలిపారు.

భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలియదు, ప్రస్తుతానికైతే విపక్షహోదాలో కూర్చోవడం తప్పనిసరి అని పవార్‌ వ్యాఖ్యానించారు. మరోసారి ఈ విషయమై సోనియాగాంధీతో చర్చిస్తానని పవార్‌ తెలిపారు.

ఎన్నికల్లో ప్రజలు బీజేపీని తిరస్కరించారన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన నుంచి నన్ను ఇప్పటివరకూ ఎవరూ సంప్రదించలేదని పవార్‌ తెలిపారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.