వామ్మో...పవన్ రెమ్యూనరేషన్ అంతా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  7 Nov 2019 6:48 AM GMT
వామ్మో...పవన్ రెమ్యూనరేషన్ అంతా..?

కొంతకాలం గ్యాప్ తర్వాత పవన్ తిరిగి వెండితెరపై సందడి చేయబోతున్నారు. బాలీవుడ్ హిట్ మూవీ పింక్ సినిమా రీమేక్ చేయబోతున్నారు. బోనీ కపూర్, దిల్ రాజు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 'మిడిల్ క్లాస్ అబ్బాయి' సినిమాను తెరకెక్కించిన వేణుశ్రీరామ్ దర్శకుడు. ఇప్పటికే ఈ సినిమాకు ఓకే చెప్పేసిన పవర్ స్టార్ త్వరలోనే షూటింగ్ కు డేట్లు కూడా ప్రకటించనున్నారని తెలిసింది. ముగ్గురు యువతుల జీవితంలో జరిగిన ఒక సంఘటన నుంచి ఒక లాయర్ ఏ విధంగా కాపాడతారు అనేది బాలీవుడ్ పింక్ చిత్ర కథాంశం. ఈ సినిమాలో లాయర్ గా బిగ్ బి అమితాబ్ బచ్చన్ నటించారు. బిగ్ బీ రోల్ లో పవన్ నటించనున్నారు. అంటే లాయర్ గా పవన్ కల్యాణ్ కన్పించనున్నారు.

అయితే ఈ సినిమా కోసం పవన్ భారీగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ హీరోకు ఏ మాత్రం తీసిపోని విధంగా పారితోషకాన్ని డిమాండ్ చేశారని సమాచారం. దాదాపు 40 కోట్లు రెమ్యూనరేషన్ అడిగారని టాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు..సినిమా లాభాల్లో 25 శాతం వాటా కూడా కుదుర్చుకున్నారని తెలిసింది. మొత్తం కలుపుకుని పవన్ రెమ్యూనరేషన్ కింద 50 కోట్ల డీల్ కుదిరిందని టాక్ హల్ చల్ చేస్తోంది. ఇప్పటివరకు ఈ రేంజ్ లో డిమాండ్ చేసింది ప్రిన్స్ మహేష్ బాబేనని సినీ విశ్లేషకుల అభిప్రాయపడుతున్నారు. కొంతకాలం గ్యాప్ తర్వాత పవన్ నటిస్తున్న సినిమా కావడంతో...ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులలోనూ మంచి స్పందన ఉంటుందనే ఉద్దేశంతోనే ఇంత పెద్ద మొత్తంలో రెమ్యూనరేషన్ అడుగుతున్నారని వార్తలు వస్తున్నాయి.

Next Story
Share it