మల్కాజిగిరిలో దారుణం చోటు చేసుకుంది. మందుబాబులు తాగిన మైకంలో బెలివరీ బాయ్‌పై పిడిగుద్దులు కురిపించారు. వివరాళ్లోకెళితే.. నిన్న రాత్రి ఆనందబాగ్ లో బిర్యానీ డెలివరీ ఇవ్వడానికి వెళ్లిన స్విగ్గీ డెలివరీ బాయ్‌పై మందుబాబులు విరుచుకుపడ్డారు. కస్టమర్‌కు ఫోన్ చేసి ఎక్కడున్నారు.. అని ప్రశ్నించినందుకు డెలివరీ బాయ్ ముఖంపై పిడిగుద్దులు కురిపించినట్టు బాధితుడి స్నేహితుడు అరవింద్ తెలిపాడు. ఈ ఘటనపై బాధితుడు మల్కాజిగిరి పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడు.