సుశాంత్‌ను చంపేశారంటూ తనకు ఎన్నో అనుమానాలున్నాయన్న సుబ్రమణియన్ స్వామి..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  30 July 2020 7:01 AM GMT
సుశాంత్‌ను చంపేశారంటూ తనకు ఎన్నో అనుమానాలున్నాయన్న సుబ్రమణియన్ స్వామి..!

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్యకు పాల్పడిన సంగతి దేశం మొత్తాన్ని షాక్ కు గురిచేసింది. సుశాంత్ ఆత్మహత్య చేసుకోలేదని.. కొందరు చంపేశారంటూ పలువురు ఆరోపణలు గుప్పించారు. సుశాంత్ ది ఆత్మహత్య కాదు మర్డర్ అని తనకు అనుమానాలు ఉన్నాయని బీజేపీ ఎంపీ సుబ్రమణియన్ స్వామి తన ట్విట్టర్ లో పోస్టు చేశారు.



తాను దీన్ని ముమ్మాటికీ హత్యగానే భావిస్తూ ఉన్నానని కొన్ని కీలక పాయింట్లను సుబ్రమణియన్ స్వామి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. సామాజిక మాధ్యమాల్లో సుశాంత్ కనిపించకుండా పోవడం, మెడ మీద ఉన్న గుర్తులు, కళ్లు తేలేయక పోవడం, ఫ్యాన్ కు వేలాడుతున్న వస్త్రం, శరీరం మీద ఉన్న వేరు వేరు గుర్తులు, సిసిటివి ఫుటేజీ, సుశాంత్ సన్నిహితుల ప్రవర్తనా తీరు, దిశా సలియన్ ఆత్మహత్య, సూసైడ్ నోట్ కనిపించకుండా పోవడం, సుశాంత్ పదే పదే సిమ్ కార్డులను మార్చడం వంటివన్నీ మర్డర్ అనే అనుమానాలకు తావు ఇస్తున్నాయని ఆయన ఓ లిస్టు తయారుచేశారు.

సుశాంత్ మరణంపై సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేయాలని సుబ్రమణియన్ స్వామి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. బీహార్ పోలీసులు సుశాంత్ మరణంపై ఇన్వెస్టిగేషన్ చేయడానికి ముందుకు వచ్చినప్పుడు వారికి అవకాశం ఇవ్వాలని ట్వీట్ చేశారు.

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసును సీబీఐకి బదిలీ చేసేది లేదని మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ తేల్చి చెప్పారు. ముంబై పోలీసులే ఈ కేసును విచారిస్తారని ఆయన స్పష్టం చేశారు. ఈ కేసులో ముంబై పోలీసులు ఇప్పటికే పలువురు బాలీవుడ్ ప్రముఖుల స్టేట్‌మెంట్స్‌ను రికార్డ్ చేశారు.

పాట్నాలోని రాజీవ్ నగర్ పోలీస్ స్టేషన్‌లో రియా చక్రవర్తిపై కేసును సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తండ్రి కేకే సింగ్ ఫిర్యాదు చేశారు. కేకే సింగ్ ఫిర్యాదు మేరకు సుశాంత్ సూసైడ్‌కు సహకరించిందని, అలాగే చీటింగ్, కుట్ర ఆరోపణలపై పోలీసులు రియా చక్రవర్తిపై కేసును నమోదు చేశారు. పాట్నా నుంచి న‌లుగురు పోలీసుల బృందం రియాను విచారించేందుకు మంగ‌ళ‌వారం ముంబైకి చేరుకుంది. ముంబైలోని రియా చ‌క్ర‌వ‌ర్తి ఇంటికెళ్ల‌గా.. రియా లేన‌ట్టుగా మీడియాలో వార్తలు వచ్చాయి.

సుశాంత్ ఫ్యామిలీ అడ్వకేట్ వికాస్ సింగ్ మాత్రం రియాను అరెస్ట్ చేస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు. సుశాంత్ కేసులో రియా చక్రవర్తిని అరెస్ట్ చేయాలి. అతి త్వరలో జరిగే అవకాశాలు కనబడుతున్నాయనే ఆశాభావాన్ని వికాస్ సింగ్ వ్యక్తం చేశారు. ఈ కేసులో అరెస్టులు జరిగితేనే అసలు విషయాలు బయటకు వస్తాయి. అప్పడే ఈ కేసుకు, సుశాంత్‌కు న్యాయం జరుగుతుంది అని వికాస్ సింగ్ అన్నారు.

Next Story