సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ను చంపేశారు.. సీబీఐ విచారణ చేయాలి

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  15 Jun 2020 10:47 AM GMT
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ను చంపేశారు.. సీబీఐ విచారణ చేయాలి

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణవార్త ఒక్క బాలీవుడ్ కే కాదు.. మొత్తం దేశానికే షాకింగ్ న్యూస్. అతడు ఆత్మహత్య చేసుకోడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకునేటంత పిరికివాడు కాదని.. అతడి మరణంపై సిబిఐ దర్యాప్తు చేయాలని జన్ అధికార్ పార్టీ ఛీఫ్ పప్పు యాదవ్ డిమాండ్ చేస్తున్నారు.

సుశాంత్ మరణవార్త గురించి తెలియగానే పప్పు యాదవ్ పాట్నాలోని సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కుటుంబ సభ్యులను కలిశారు. సుశాంత్ సింగ్ మరణంపై ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. సుశాంత్ సింగ్ మామ ఏడీజీపీ అయిన ఓపీ సింగ్ కూడా ఈ మరణంపై అనుమానాలు వ్యక్తం చేశారు. పోలీసులు సుశాంత్ మరణంపై తప్పకుండా విచారణ చేయాలి.. మేము సిబిఐని దర్యాప్తు చేయాలని కోరుతున్నామని అన్నారు.

సుశాంత్ సూసైడ్ విషయంలో పలువురిని పోలీసులు ప్రశ్నించనున్నారు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ బాలీవుడ్ నటి రియా చక్రవర్తితో గత కొద్దికాలంగా రిలేషన్ షిప్ లో ఉన్నాడని వార్తలు వచ్చాయి. రియా చక్రవర్తిని త్వరలోనే ముంబై పోలీసులు ప్రశ్నించనున్నారు. సుశాంత్ తో ఆమెకు ఉన్న అనుబంధం ఎలాంటిదో తెలుసుకోవాలని అనుకుంటున్నారు.

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఈ ఏడాది నవంబర్ నెలలో పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడని.. అతడి కజిన్ మీడియాకు వెల్లడించాడు. ఇంతలోనే అతడు ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధను మిగిల్చిందని చెప్పుకొచ్చాడు. సుశాంత్ ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నాడో ఆమె పేరు చెప్పకుండా.. సుశాంత్ నవంబర్ నెలలో పెళ్లి చేసువాలని అనుకున్నాడని.. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేయాలని కుటుంబం కూడా ప్లాన్ చేసిందని తెలిపాడు.

Next Story
Share it