ప్రైవసీకి పెద్ద దెబ్బా..? సోషల్ రిజిస్ట్రీ..
By Kumar Sambhav Shrivastava Published on 18 March 2020 8:25 AM ISTసీనియర్ అధికారి అభ్యంతరాలు పట్టించుకోని కేంద్రం
నవంబర్ 27, 2015న మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ఎకనామిక్ అనడ్వైజర్ మనోరంజన్ కుమార్ నేషనల్ సోషల్ రిజిస్ట్రీ గురించి ఓ నోట్ లో ప్రస్తావిస్తూ దేశంలోని పేద ప్రజలను గుర్తించి.. ప్రభుత్వ పథకాలు వారికి అందించే వెసులు బాటు ఉంటుంది. అది కూడా సరికొత్త పద్ధతిలో.. పారదర్శకంగా అందించవచ్చు అని తెలిపారు.
అయిదు సంవత్సరాలు పూర్తీ అయిన తర్వాత సోషల్ రిజిస్ట్రీ అన్నది చివరి దశకు చేరుకున్న తరుణంలో ఇప్పుడు ఉన్న వ్యవస్థ గురించి భయపడుతూ ఉన్నాడు. సదుద్దేశంతో రూపొందించిన డేటా పక్క దారి పట్టే అవకాశం ఉందని ఆయన అంటున్నారు. 1.2 బిలియన్ల మంది డేటా పక్కదారి పట్టడం వలన వారి స్వేచ్చకు, హక్కులకు భంగం కలిగించే విధంగా ఉందని ఆయన అంటున్నారు.
రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం డేటా అండ్ గవర్నెన్స్ రీసెర్చర్ కొడాలి శ్రీనివాస్ సంపాదించిన డాక్యుమెంట్ల ఆధారంగా చూస్తే సోషల్ రిజిస్ట్రీ అన్నది పెద్ద సముద్రం లాంటిదని.. 1.2 బిలియన్ల ప్రజలకు సంబంధించిన డేటాను ట్రాక్ చేయడం పెద్ద కష్టం కాదని తెలిపారు. ప్రభుత్వం ప్రతి పౌరుడి మీద నిఘా వేసిందని ఆయన నమ్ముతున్నారు.
హఫ్ పోస్ట్ ఇండియా రిపోర్ట్ ప్రకారం నేషనల్ సోషల్ రిజిస్ట్రీ ఒక్కో పౌరుడికి సంబంధించిన విషయాలన్నింటినీ నిఘా వేసింది. ఊర్లు మారినా, ఉద్యోగాలు మారినా, కొత్త ప్రాపర్టీ కొన్నా, కుటుంబంలో ఎవరైనా పుట్టినా, చనిపోయినా, పెళ్లి జరిగినా, అత్తవారింటికి వచ్చినా అన్నీ రికార్డులో ఎక్కించబడుతున్నాయి. అలాగే ఆధార్ నంబర్ల కారణంగా మతం, కులం, ఆదాయం, ఆస్తులు, చదువు, పెళ్ళి అయ్యిందా లేదా, ఉద్యోగం ఉందా లేదా, ఏమైనా అంగవైకల్యం ఉందా, వంశ వృక్షానికి సంబంధించిన ప్రతి ఒక్క అంశం డేటా బేస్ లో పొందుపరిచారు.
సోషల్ రిజిస్ట్రీ సిస్టం అన్నది రూపొందించడానికి ముఖ్య కారణం వెల్ఫేర్ స్కీములన్నవి అర్హత ఉన్న వాళ్ళకే అందాలి.. అంతేకాకుండా ఈ మొత్తం విషయాల్లో పారదర్శకత అన్నది లోపించకూడదని మనోరంజన్ కుమార్ హఫ్ పోస్ట్ ఇండియాతో చెప్పుకొచ్చారు. 2019లో ఆయన రిటైర్ అయ్యాక చేసిన మొదటి వ్యాఖ్యలు ఇవే..! కొందరు అధికారులు ప్రభుత్వ స్కీములు ఎక్కువమందికి చేరాయని చెబుతున్నారని.. వీటిని మానుకోవాలని ఆయన సూచించారు. సంక్షేమ పథకాలకు సంబంధించిన సమాచారం సోషల్ రిజిస్ట్రీలో ప్రతిబింబించాలని ఆయన అన్నారు.
ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా చివరి దశలో ఉన్న సోషల్ రిజిస్ట్రీని ఆచరణలో పెట్టడం కష్టతరమేనని కుమార్ చెప్పుకొచ్చారు. మొదట్లో అనుకున్న దానికంటే డేటా అన్నది చాలా ఎక్కువగా సేకరించడం చాలా ముఖ్యమైన అంశమే అయినప్పటికీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల దృష్ట్యా డేటా విషయంలో అనుమానాలు ఉన్నాయని ఆయన అన్నారు. పెద్ద ఎత్తున డేటా అన్నది పొందుపరచడం ద్వారా వచ్చే సమస్యలు కూడా ప్రభుత్వానికి తెలుసునని అన్నారు.
భారతదేశమన్నది పోలీసు స్టేట్ గా ఎదుగుతూ ఉండడాన్ని తాను నమ్ముతున్నానని ఆయన అన్నారు. ఏ దేశం అభివృద్ధి చెందదానికైనా హౌస్ హోల్డ్ సెక్టార్ కు, బిజినెస్ రంగానికి పెద్ద పీఠ వేయడమే కాకుండా.. ప్రభుత్వం పెద్దగా ఆంక్షలు విధించకూడదని ఆయన అన్నారు.
కానీ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలు, సెమి ప్రభుత్వ రంగ సంస్థలు పోలీసింగ్ ఏజెంట్ లా మారిపోయాయని ఆయన అన్నారు. ఇన్సూరెన్స్ రెగ్యులేషన్, బ్యాంకింగ్ సెక్టార్, ట్యాక్స్, ప్రాపర్టీ రిజిస్ట్రేషన్.. వాటన్నిటినీ చాలామంది క్రిమినల్ కోణంలోనే చూస్తున్నారని అన్నారు. హౌస్ హోల్డ్ సెక్టార్ కు, బిజినెస్ రంగానికి తగినంత స్వేచ్ఛ ఇవ్వాలని ఆయన కోరారు.
సోషల్ రిజిస్ట్రీ లాంటి పెద్ద డేటా బేస్ లను ఉపయోగించడానికి ముఖ్య కారణం పేదరిక నిర్మూలన. 2000 సంవత్సరం అలాంటి సమయంలో పలు స్కీమ్ లను ప్రవేశ పెట్టారు. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయిమెంట్ గ్యారెంటీ యాక్ట్ స్కీమ్, సర్వ శిక్షా అభియాన్, రైట్ టు ఫుడ్ యాక్ట్ ప్రకారం అప్పటికే పలువురు లబ్దిదారులుగా మారారు.
రాష్ట్ర ప్రయోజాలను పొందుతున్న వారికి సంబంధించిన సమాచారం వారి వద్ద ఉండడమే కాకుండా.. నేషనల్ సోషల్ రిజిస్ట్రీ వద్ద ప్రతి ఒక్క పౌరుడికి సంబంధించిన డేటా అన్నది ఉందని కొందరు నిపుణులు భావిస్తున్నారు. సిలోన్ లో ఆధార్ సీడింగ్ డేటా మొత్తం ఇప్పటికే పొందు పరిచారని హుఫ్టన్ పోస్ట్ ఇండియాకు ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఎవరో ఒకరు సాఫ్ట్వేర్ ను రూపొందించి రన్ చేస్తే అంతా ఒకచోటికి వచ్చేస్తుందని ఆయన అన్నారు.
మనోరంజన్ కుమార్ సోషల్ రిజిస్ట్రీని ప్రతిపాదించిన వారిలో ముఖ్యులు. 2015 లో ఆయన రాసిన కాన్సెప్ట్ నోట్ కాకుండా ఆయన రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీతోనూ, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ, హై లెవెల్ ఎక్స్పర్ట్ కమిటీలతో మీటింగ్ లు నిర్వహించడమే కాకుండా యూనియన్ మినిస్ట్రీలకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ, వరల్డ్ బ్యాంకు, నీతి ఆయోగ్ లకు సంబంధించిన సూచనలను పాటించి ఆయన ప్రాజెక్టును మొదలుపెట్టారు. ప్రాజేతు కోసం ఆయన చేసిన కృషి కూడా అందరి దృష్టిలో పడింది.
తమకు ఒక ఛాలెంజింగ్ పనిని అప్పగించారని.. అందుకు సంబంధించిన పనులు మొదలుపెట్టామని 2015 నవంబర్ లో ఆయన రాసిన నోట్ ద్వారా బహిర్గతమైంది. ఈ ప్రాజెక్టు అవసరమైన సలహాలు, సూచనలు కూడా పలువురు నిపుణుల నుండి తీసుకున్నారు. వరల్డ్ బ్యాంకు ఇచ్చిన సలహాలు కూడా ఉపయోగపడ్డాయని ఆయన అన్నారు. ఎస్ఇసిసి లేదా సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ అన్నవి సోషల్ రిజిస్ట్రీ ఫౌండేషనల్ డేటా బేస్ కింద ఉపయోగపడ్డాయి.
కుమార్ 2016 వరకూ ప్రాజెక్ట్ లో కీలక బాధ్యతలు చేపట్టారు. 2017 లో ఆయనకు ఈ పని విషయంలో అనుమానాలు ఉత్పన్నమయ్యాయి. మార్చి 15, 2017 లో సర్వ సాధారణంగా పలు మినిస్ట్రీలతో ఆయన చేసిన సమాలోచనలు, సోషల్ మినిస్ట్రీ విషయంలో వరల్డ్ బ్యాంకు చేసిన ప్రతిపాదనలకు సంబంధించి కొన్ని విషయాలను చూసి ఎక్కడో తప్పు జరుగుతోందని ఆయన గమనించారు.
సోషల్ రిజిస్ట్రీలో గోప్యతకు సంబంధించిన విషయాలను కూడా తాను గుర్తించానని.. ప్రభుత్వం ప్రతిపాదించిన వాటిలో కొన్ని చీకటి కోణాలు ఉన్నాయని గమనించానని అన్నారు. క్షణక్షణం ఆయన సోషల్ రిజిస్ట్రీని పరిశీలిస్తూనే ఉన్నారు. అదే సమయంలో రైట్ టు ప్రైవసీ యాక్ట్ కింద సుప్రీం కోర్టు వద్ద పిటీషన్ల మీద పిటీషన్లు వేయడం మొదలైంది. మోదీ ప్రభుత్వం కూడా ప్రభుత్వ డేటాబేస్ లో ఆధార్ కు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ వెళుతోంది. యూనిక్ ఐడీ నెంబర్లు కూడా తీసుకుందామని చూశారు. అదే సమయంలో కుమార్ కు ఆధార్ విషయంలో ఎక్కడో తప్పు జరుగుతోందన్న అనుమానాలు కూడా ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉండేవనే విషయాన్ని హఫ్ పోస్ట్ ఇండియాకు తెలిపారు.
ప్రస్తుతం డబ్బును డిపాజిట్ చేయాలన్నా, రీఫండ్ లభించాలన్నా, ఆసుపత్రిలో పేషెంట్ కు సీరియస్ ఉన్నప్పుడు డబ్బులు కట్టాలన్నా ఆధార్ నెంబర్ తీసుకోవడంపై తనకు మరిన్ని ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయని ఆయన అన్నారు. అందరూ పోలీసింగ్ వర్క్ చేస్తున్నారని కుమార్ తెలిపారు. అలాంటి సమయాల్లో ఆధార్ అన్నది చాలా ప్రమాదకరమైన వస్తువుగా తనకు అనిపించిందని అన్నారు. అందులో చాలా విషయం ఉండేదని.. అలాగే టెక్నాలజీ కూడా సీక్రెట్ గా ఉంచదని ఆయన అభిప్రాయ పడ్డారు.
ఎవరైనా ఒక ఆఫీసర్ వచ్చి బయోమెట్రిక్స్ కావాలని అనుకున్నాడు. ఎందుకంటే అతడు ఓ కేసును పరిష్కరించాల్సిన అవసరం అతని మీద ఉంటుంది. ఇలాంటి సమయంలో అతడు ఎవరో ఒకరి సహాయం తీసుకుని.. బయోమెట్రిక్స్ ను యాక్సెస్ చేసే అవకాశం ఉంది. కొన్ని కొన్ని సార్లు బయోమెట్రిక్స్ ఎంతో ప్రమాదకరంగా మారే అవకాశం ఉండడంతో ఆయన నోట్ రాయడానికి కారణమైంది.
కుమార్ నోట్ రాసిన కొన్ని నెలలకు, 2017 ఆగష్టు నెలలో సోషల్ రిజిస్ట్రీ కి సంబంధించిన డేటా వలన తప్పులు జరుగుతున్నాయని భావించిన భారత సుప్రీం కోర్ట్ రైట్ టు ప్రైవసీ పై తన తీర్పు వెలువరించింది.
ఒక్కొక్కరి డేటాను సేకరించడం ద్వారా పర్సనల్ డేటా పొందుపరచడం దగ్గర నుండి ఏకంగా ఆ పర్సనల్ సమాచారం మొత్తం వేరే వారి చేతుల్లోకి వెళ్లిపోయే అవకాశం ఉంది. ఉద్యోగ నిర్వహణ, ఆర్థిక పరిస్థితి, ఆరోగ్యం, అతడి ప్రాధాన్యత, అభిరుచులు, పద్ధతులు, అతడు తిరుగుతున్న ప్రదేశాలు కూడా తెలుసుకోవడాన్ని నిఘా ఉంచడం కిందకే వస్తుందని సుప్రీం కోర్టు అభిప్రాయ పడింది. మతాలు, కులాలకు సంబంధించి వివక్షలు వ్యక్తమయ్యే అవకాశాలు ఉన్నాయని సుప్రీం కోర్టు తెలిపింది.
ఆధార్ కార్డుకు సంబంధించిన సమాచారం లేకుండా సోషల్ రిజిస్ట్రీని రూపొందించాలని ప్రభుత్వం యోచిస్తోందని హఫ్ పోస్ట్ ఇండియా ఇంతకు ముందే ప్రచురించింది. అది వీలుపడకపోవడంతో ఆధార్ యాక్టును ప్రవేశపెట్టాలని భావించింది. అదే కానీ జరిగితే సుప్రీం కోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను తుంగలో తొక్కినట్లేనని ప్రైవసీ అడ్వొకేట్లు వాదిస్తూ ఉన్నారు.
సరైన చట్టం లేకుండా ప్రభుత్వం ప్రజలకు సంబంధించిన డేటాను సోషల్ రిజిస్ట్రీలో పొందుపరిస్తే దాన్ని చాలా మార్గాల్లో దుర్వినియోగం చేసే అవకాశం ఉందని కొడాలి శ్రీనివాస్ చెబుతున్నారు. ఏ ప్రభుత్వం అధికారం లోకి వచ్చినా డేటాను యాక్సెస్ చేసే అవకాశం ఉంటుందని.. అలాంటప్పుడు ఓటర్ ప్రొఫైల్స్ ను రూపొందించడం పెద్ద కష్టం కాకపోవచ్చు.. అలాగే నియోజకవర్గాలను ఎప్పటికప్పుడు మారుస్తూ ఆ పార్టీనే ఎల్లకాలం పవర్ లో ఉండేలా చేసుకునే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు.
సోషల్ రిజిస్ట్రీ పలు సంస్థల చేతుల్లోకి వెళ్లే అవకాశం ఉన్నందున దానిని ఎట్టిపరిస్థితుల్లోనూ అమలుచేయకూడదని కుమార్ చెప్పుకొచ్చారు. డేటాను మోసపూరిత కంపెనీల చేతిలోకి వెళ్లకుండా ఆపగలిగితే ప్రజలకు న్యాయం చేసినట్లేనని ఆయన హఫ్ పోస్ట్ ఇండియాకు తెలిపారు. మొదట సిఆర్పిసిని రివ్యూ చేయాలని.. అలాగే ఫింగర్ ప్రింట్స్ కు సంబంధించిన సమాచారం ఎవరి చేతుల్లోకి వెళ్లకుండా చేయాలని. ప్రభుత్వ డేటా సెక్యూరిటీని మొదట కఠినతరం చేయాలని.. కోర్టులను కూడా అభివృద్ధి చేయాలని.. అలాంటప్పుడే ఇలాంటి సిస్టమ్ ను ఆచరణలో పెట్టాలని.. లేదంటే కేంద్రం దీన్ని దుర్వినియోగ పరిచే అవకాశాలు ఉన్నాయని అన్నారు.
తనకు దేశ సమగ్రతను కాపాడే విషయంపై ఇప్పటికీ నమ్మకం ఉందని. సివిల్ సర్వెంట్స్, కోర్టులు, పోలీసులు ఎప్పుడైతే దీన్ని సీరియస్ గా తీసుకుంటారో అప్పుడే మార్పు అన్నది సాధ్యమవుతుందని ఆయన అన్నారు. అందరికీ మేలు జరుగుతుందనే ఆలోచనతోనే ఈ సిస్టమ్ ను తాను మొదట ప్రతిపాదించానని.. కానీ ఇప్పుడు పరిస్థితిలో చాలా మార్పులు వచ్చాయని ఆయన అన్నారు. కేంద్రం దగ్గర ఉన్న హక్కులతో పోలిస్తే తన హక్కులు చాలా చిన్నవని.. కానీ వీటిని కూడా బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరికి సంబంధించిన స్వేచ్ఛ కూడా చాలా ముఖ్యమని ఆయన గుర్తు చేశారు. ప్రజాస్వామ్య బద్ధంగా చూస్తే ప్రతి ఒక్కరూ సమానమేనని కుమార్ అన్నారు.