వార్తల్లో తన కొడుకు పేరు రావడంతో.. స్పందించిన దగ్గుబాటి సురేష్ బాబు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  13 Aug 2020 12:01 PM GMT
వార్తల్లో తన కొడుకు పేరు రావడంతో.. స్పందించిన దగ్గుబాటి సురేష్ బాబు

దగ్గుబాటి ఫ్యామిలీ రానా పెళ్లి మూడ్ లో ఉంటే.. రానా తమ్ముడు అభిరామ్ యాక్సిడెంట్ విషయమై వార్తలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి.

హైదరాబాద్ మణికొండలో అభిరామ్ కారు మరో కారును ఢీకొందని... అభిరామ్ రాంగ్ రూట్లో వెళ్లడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు వార్తలు వచ్చాయి. కరీంనగర్ జిల్లా ఆరేపల్లికి చెందిన రాజు బ్రెజా కారు కొనేందుకు హైదరాబాద్‌లోని మణికొండకు రాగా.. కారు యజమానిని కలిసి టెస్ట్ డ్రైవ్ కోసం కారును తీసుకుని సతీశ్ అనే స్నేహితుడితో కలిసి వెళ్లాడు. పంచవటి కాలనీలో మల్లెమాల ప్రొడక్షన్ హౌస్ వద్ద పక్క రోడ్డులో అభిరామ్ బీఎండబ్ల్యూ కారు, బ్రెజా కారు ప్రమాదవశాత్తు ఢీకొన్నాయి. రెండు కార్లు స్వల్పంగా దెబ్బతిన్నాయి. రాజు, అభిరామ్ ఇద్దరూ రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో పరస్పరం ఫిర్యాదు చేశారంటూ వార్తలు వచ్చాయి.

ఈ వార్తలపై దగ్గుబాటి సురేష్ బాబు స్పందించారు. తన కుమారుడు యాక్సిడెంట్ చేశాడనే వార్తల్లో నిజం లేదని అన్నారు. యాక్సిడెంట్ చేసింది తన కుమారుడు అభిరామ్ కాదని.. ఆ కారు కూడా తన కుమారుడిది కాదని స్పష్టం చేశారు. సురేష్ బాబు చెప్పిన మాటల్లో ఎంత నిజముందో తెలియాల్సి ఉంది.

Next Story