ప్రశాంత్ భూషణ్.. మీరు ఒక్క రూపాయి ఫైన్ కట్టండి: సుప్రీం కోర్టు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  1 Sep 2020 12:37 AM GMT
ప్రశాంత్ భూషణ్.. మీరు ఒక్క రూపాయి ఫైన్ కట్టండి: సుప్రీం కోర్టు

ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కోర్టు ధిక్కారానికి పాల్పడినట్లు సుప్రీం కోర్టు నేడు తీర్పును వెలువరించింది. అలాగని ఆయనకు వేసిన శిక్ష ఏమిటో తెలుసా..? ఒక రూపాయి జరిమానా..! రూపాయి జరిమానా చెల్లించాలని ధర్మాసనం తీర్పు వెలువరిచింది.

2020 జూన్ 27 మరియు 29 తేదీలలో వరుసగా రెండు వివాదాస్పద ట్వీట్ల ద్వారా ప్రస్తుత సిజెఐ ఎస్ ఎ బోబ్డే మరియు గతంలో పని చేసిన నాలుగు సిజెఐలకు వ్యతిరేకంగా ఆయన చేసిన 'ధిక్కార మరియు పరువు నష్టం' వ్యాఖ్యలను, సోషల్ మీడియా ట్వీట్లను సుమోటోగా తీసుకున్న సుప్రీం కోర్టు ఈ కేసులో నేడు తీర్పు రిజర్వ్ చేసింది.

తన వివాదాస్పద వ్యాఖ్యలపై సుప్రీంకోర్టుకు క్షమాపణ చెప్పేందుకు ఆయన ఒప్పుకోకపోవడంతో... ఆయన్ని కోర్టు దోషిగా తేల్చింది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ SA బాబ్డే, సుప్రీంకోర్టుపై ట్విట్టర్ ద్వారా విమర్శలు చేయడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ఓ లాయర్ అయివుండీ ఇలా చెయ్యడం కరెక్టు కాదని క్షమాపణలు చెప్పాలని కోరింది. ప్రశాంత్ భూషణ్ క్షమాపణలు చెప్పడానికి ఒప్పుకోలేదు.. తన వ్యాఖ్యల్లో తప్పేమీ లేదని.. ఇలాంటి విమర్శల్ని సుప్రీంకోర్టు సానుకూలంగా తీసుకోవాలని అన్నారు. సుప్రీం ఇలాంటి వాటిని విశాల దృక్పథంతో చూడాలని భూషణ్ తరపు లాయర్ కోర్టులో వాదించారు. అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ కూడా ప్రశాంత్ భూషణ్‌కి మద్దతుగా నిలిచారు. తన వివాదాస్పద వ్యాఖ్యలపై సుప్రీంకోర్టుకు క్షమాపణ చెప్పేందుకు ఆయన ఒప్పుకోకపోవడంతో ఆయన్ని కోర్టు దోషిగా తేల్చింది. ఒక్క రూపాయి జరిమానా కట్టమని కోరింది.

న్యాయవ్యవస్థను ఆయన ధిక్కరించారని సుప్రీం కోర్టు చెబుతుండగా... పలువురు మేదావులు,ప్రజాస్వామిక వాదులు,లా స్టూడెంట్స్ ప్రశాంత్ భూషణ్‌కు మద్దతుగా నిలుస్తూ వచ్చారు.భూషణ్‌పై కేసులో తీర్పుకు ఒక్కరోజు ముందు 122 మంది విద్యార్థులు సీజేఐ, ఇతర న్యాయమూర్తులకు లేఖలు రాశారు. తీర్పును పున:పరిశీలించాలని కోరారు. ప్రజల విశ్వాసాన్ని పునరుద్ధరించడం ద్వారా న్యాయ వ్యవస్థ విమర్శలకు బదులివ్వాలని కోరారు.

Next Story