కర్నాటక రెబల్ ఎమ్మెల్యేల పిటిషన్‌పై సుప్రీం సంచలన తీర్పు
By న్యూస్‌మీటర్ తెలుగు
ముఖ్యాంశాలు
- కర్నాటక అనర్హత ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
- రెబల్ ఎమ్మెల్యేలు పోటీ చేసేందుకు అనర్హత కల్పించిన సుప్రీంకోర్టు
ఢిల్లీ: కర్నాటక అనర్హత ఎమ్మెల్యేల కేసులో అత్యున్నత న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. 17 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తూ అప్పటి స్పీకర్ రమేశ్ కుమార్ తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్ధించింది. అయితే ఐదేళ్లపాటు పోటీ చేయరాదంటూ స్పీకర్ విధించిన నిషేధాన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. ఈ మేరకు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ కృష్ణ మురారిలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం తీర్పు చెప్పింది.
అనర్హత వేటు పడిన 17 మంది ఎమ్మెల్యేలలో 12 మంది కాంగ్రెస్, ముగ్గురు జేడీఎస్, ఒకరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు ఉన్నారు. అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలు పోటీ చేసేందుకు సుప్రీంకోర్టు అవకాశం కల్పించింది. అక్టోబర్ 25న రెబల్ ఎమ్మెల్యేల పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణను పూర్తి చేసింది. బుధవారం రోజును తీర్పును వెలువరించింది. అయితే రెబల్ ఎమ్మెల్యేలు నేరుగా సుప్రీంకోర్టుకు రావడాన్ని ధర్మాసనం తప్పుబట్టింది. హైకోర్టుకు వెళ్లకుండా తమ వద్దకు రావడం సమంజసంగా లేదని హైకోర్టు వ్యాఖ్యనించింది. డిసెంబర్ 5న కర్నాటకలో ఉప ఎన్నికలు జరగనున్నాయి.