సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురు..

By అంజి  Published on  18 March 2020 7:47 AM GMT
సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురు..

ముఖ్యాంశాలు

  • ఈసీ నిర్ణయాన్ని సమర్థిస్తూ నిర్ణయం
  • ఎన్నికల కోడ్ కూడా ఎత్తివేయాలని ఆదేశాలు
  • ఎన్నికల వాయిదాని కొనసాగించాలని సుప్రీంకోర్టు ఆదేశం

ఢిల్లీ: సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురైంది. స్థానిక ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. ఎన్నికల కోడ్‌ ఎత్తివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికలను వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ బాబ్డే నేతృత్వంలోని జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్, జస్టిస్‌ సూర్యకాంత్‌తో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఎన్నికల వాయిదాను కొనసాగించాలని స్పష్టం చేసింది.

Also Read: క్వారంటైన్ అంటే ఏమిటి ?

అయితే ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనేది ఎన్నికల సంఘానిదే తుది నిర్ణయమని చెప్పింది. ఆరు వారాల తర్వాత కూడా పరిస్థితిపై సమీక్షించి నిర్ణయం తీసుకునే అవకాశాన్ని సుప్రీంకోర్టు ఈసీకి కల్పించింది. ఎన్నికల ప్రవర్తన నియమావళిని సుప్రీంకోర్టు రద్దు చేసింది. అభివృద్ధి పథకాలు కొనసాగించేందుకు అనుమతి ఇచ్చింది. అయితే కొత్త పథకాలు చేపట్టరాదని ప్రభుత్వాన్ని ఆదేశించిన.. సుప్రీంకోర్టు విచారణ ముగించింది.

Also Read: కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డికి బెయిల్‌..

Next Story