కార్తీ 'ఖైదీ' సినిమా పై సూపర్ స్టార్ మహేష్ కామెంట్ ఏంటి..?
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 2 Nov 2019 10:05 AM GMTతమిళ హీరో కార్తీ నటించిన తాజా చిత్రం 'ఖైదీ'. ఈ సినిమా తెలుగు, తమిళ్ లో అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. చిత్ర యూనిట్ పై సినిమా ప్రేక్షకులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ సినిమా ఇచ్చిన విజయోత్సహాంతో 'ఖైదీ' స్వీకెల్ తీయనున్నట్టు కార్తీ ఇటీవల ప్రకటించారు. డైరెక్టర్ లోకేష్ 30 రోజుల డేట్స్ ఇస్తే చాలు 'ఖైదీ 2' తీస్తానన్నారని కార్తీ తెలియచేసారు. ప్రస్తుతం కార్తీ చేస్తోన్న అయిన తర్వాత 'ఖైదీ 2' ఉంటుందని చెప్పారు.
ఇదిలా ఉంటే... సూపర్ స్టార్ మహేష్ బాబు 'ఖైదీ' సినిమా పై ట్విట్టర్ ద్వారా ప్రశంసల వర్షం కురిపించారు. ఇంతకీ మహేష్ ఏమన్నారంటే... 'ఖైదీ' ఓ న్యూఏజ్ ఫిల్మ్ మేకింగ్. థ్రిల్లింగ్ యాక్షన్ సన్నివేశాలు, గ్రిప్పింగ్ స్క్రిప్ట్, కళ్లు చెదిరే నటన అదిరింది. పాటలు లేకుండా ఆకట్టుకున్నారు. స్వాగతించాల్సిన ప్రయోగం ఇది అని 'ఖైదీ' సినిమా పై ప్రశంసించారు. ప్రస్తుతం మహేష్ నటిస్తోన్న 'సరిలేరు నీకెవ్వరు' సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది.