సూపర్ సైక్లోన్‌గా అంఫన్ తుఫాను
By సుభాష్ Published on 20 May 2020 11:28 AM ISTబంగాళాఖాతంలో ఏర్పడిన అంఫన్ తుఫాను గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. బుధవారం మధ్యాహ్నం తర్వాత తీరం దాటే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కాగా, అంఫన్ తుఫాను సూపర్ సైక్లోన్‌గా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఉత్తర నైరుతి వైపు అంఫన్ తుఫాను దూసుకొస్తుందని, పారదీప్‌కు దక్షిణ దిశగా 360 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని పేర్కొంది.
పశ్చిమ బెంగాల్‌లోని దిశ ప్రాంతానికి 510 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని
అధికారులు పేర్కొంటున్నారు. మంగళవారం మధ్యాహ్నం బెంగాల్ - బంగ్లాదేశ్ మధ్య
హతీయ ఐలాండ్ ఏరియాలో క్రమ క్రమంగా బలహీనపడి అతీ తీవ్ర తుఫాను తీరం
దాటనుందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే తీరం దాటే సమయంలో గంటకు
125 నుంచి 200 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ఏపీలోని అన్ని పోర్టుల్లో
మూడవ నెంబర్ హెచ్చరికలు జారీ చేశారు. ఉత్తర కొస్తా జిల్లా భారీ వర్షాలు కురిసే
అవకాశం ఉందని, మత్స్యకారులు వేటకు వెల్లవద్దని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.