సన్నిలియోన్ కొత్తకారు.. ఫోటోలు వైరల్
By తోట వంశీ కుమార్ Published on 10 Sept 2020 1:27 PM ISTబాలీవుడ్ నటి సన్నిలియోన్‌కు చాలా మంది అభిమానులు ఉన్నారు. తనకు అందివచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటోంది. ఇక టాలీవుడ్‌లో రెండు మూడు సినిమాల్లో మెరిసింది సన్ని. కాగా.. సన్నికి ఓ తీరని కోరిక ఉందట. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఆ కలని ఈ మధ్యనే నిజం చేసుకుందట. ఈ విషయాన్ని సన్ని లియోన్‌నే స్వయంగా చెప్పింది.
కరోనా విజృంభిస్తుండడంతో.. తన అత్తగారి బాగోగులు చేసుకోవడానికి సన్ని లాస్ ఏంజిల్స్ వెళ్లింది. ప్రస్తుతం అక్కడే ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న లగ్జరీ కార్లలో మసెరటీ లీవెంటే బ్రాండ్ ఒకటి. ఈ కారు అంటే సన్నికి చాలా ఇష్టమట. దీని ఖరీదు కోటీ 45లక్షల రూపాయాలు. తాజాగా ఈ కారును కొని తన కోరికను తీర్చుకుంది.
'నిన్ననే ఇంటికి తీసుకొచ్చాను. ఈ కారును నడిపిన ప్రతిసారీ నేను చాలా సంతోషంగా ఉన్నాను' అని ఇన్ స్టాలో మసెరటితో మెరిసిపోతున్న ఫొటోని షేర్ చేసింది సన్నీ. ప్రస్తుతం సన్ని షేర్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కొత్త కారు బాగుందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
View this post on InstagramBrought home this beast yesterday! Every time I drive this car I am so happy! @maserati @maseratiusa
A post shared by Sunny Leone (@sunnyleone) on