గుడ్‌న్యూస్ చెప్పిన శాస్త్రవేత్తలు.. వైరస్‌కు సూర్యుడే యముడా.?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  25 April 2020 10:06 AM IST
గుడ్‌న్యూస్ చెప్పిన శాస్త్రవేత్తలు.. వైరస్‌కు సూర్యుడే యముడా.?

ప్రపంచం మొత్తాన్ని గడగడలాడిస్తున్న‌ కరోనా వైరస్ కు మందు కనిపెట్టే పనిలో ఇప్పటికే చాలా సంస్థలు పనిచేస్తున్నాయి. ప్రభుత్వాలు కూడా వైరస్ ను కట్టడి చేసే పనుల్లో ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఓ కీలక సామాచారం బయటకు వచ్చింది. కరోనా వైరస్ సూర్యుడి వెలుగులో చనిపోతుందని అంటున్నారు. అమెరికాకు చెందిన సీనియర్ అధికారి గురువారం నాడు స్పష్టం చేశారు. తాజాగా రీసెర్చర్లు చేసిన స్టడీలో ఈ విషయం బయట పడిందని.. ఈ విషయాన్ని త్వరలోనే బయటపెట్టనున్నారు.

హోమ్ ల్యాండ్ సెక్యూరిటీకి చెందిన సైన్స్ అండ్ టెక్నాలజీ అడ్వైజర్ విలియం బ్రియాన్ మాట్లాడుతూ.. అల్ట్రా వయొలెట్ రేస్ పాథోజెన్ మీద ప్రభావం చూపుతుందని సైంటిస్టులు కనుగొన్నారని ఆయన అన్నారు. ఈ ఏడాది వేసవి కరోనా దాదాపు కట్టడి అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

శాస్త్రవేత్తలు ముఖ్యంగా గమనించింది ఏమిటంటే సూర్య రశ్మి బాగా ఉన్న చోట వైరస్ వ్యాప్తి పెద్దగా ఉండదని అన్నారు. వైరస్ ఏదైనా వస్తువు మీద ఉన్నా.. గాల్లో ఉన్నా సూర్య రశ్మి ప్రభావం ఉండడంతో అది నశిస్తోందని అన్నారు. వేడి, గాలిలో తేమ వైరస్ పై ప్రభావం చూపే అవకాశం ఉందని రీసెర్చర్లు గమనించారు. సూర్యరశ్మి, వేడి, అధిక తేమ ఉన్న ప్రాంతాల్లో వైరస్ త్వరగా బలహీనపడుతుందని.. తెలిపే ఈ రీసర్చ్ పేపర్ ఇంకా బయటకు రాలేదు. అధిక తేమతోపాటు సూర్యరశ్మి కూడా సోకినప్పుడు రెండు నిమిషాల్లోనే వైరస్ ప్రభావం తగ్గిందని అన్నారు. సూర్యరశ్మి కారణంగా వైరస్ 90 సెకన్లలోనే సగం బలాన్ని కోకోల్పోయిందన్నారు. ఆల్ట్రా వయొలెట్ కిరణాల్లో స్టెరిలైజింగ్ ఎఫెక్ట్ ఉంటుంది.. వీటి రేడియేషన్ కారణంగా వైరస్ కు సంబంధించిన జెనెటిక్ మెటీరియల్ నశిస్తుందని అన్నారు. సూర్యుడి కిరణాల్లో కూడా ఈ అల్ట్రావయొలెట్‌ కిరణాలు ఉంటాయని, వాటివల్ల కరోనా వైరస్‌ నశించి పోతుందని ఆయన చెప్పారు.

'ఈ ప్రయోగం ఎలా చేశారు అన్నది తెలియాల్సి ఉందని.. అది తెలిసినప్పుడే రిజల్ట్ అన్నది తెలిసి వస్తుందని' టెక్సాస్ ఏ అండ్ ఎం యూనివర్సిటీ బయోలాజికల్ సైన్సెస్ హెడ్ బెంజమిన్ న్యూమన్ తెలిపారు.

వైరస్ ప్రభావం చాలా తగ్గుతోంది:

మేరీల్యాండ్ లోని నేషనల్ బయో డిఫెన్స్ అనలైసిస్ అండ్ కౌంటర్మెజర్స్ సెంటర్ లో ఈ ప్రయోగాలు చేశామని బ్రియాన్ తెలిపారు.

21 నుండి 24 డిగ్రీల ఉష్ణోగ్రత.. గాలిలో 20 శాతం తేమ ఉన్నప్పుడు 18 గంటల్లో సగానికి పైగా వైరస్ జీవితకాలం తగ్గిందని అన్నారు. డోర్ హ్యాండిల్స్, స్టెయిన్ లెస్ స్టీల్ మీద కూడా ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. వేసవి కాలం లాంటి వాతావరణాన్ని తాము సృష్టించామని.. అలాంటి సమయంలో తాము వైరస్ ప్రభావం తగ్గడాన్ని గమనించామని అన్నారు. రాబోయే వేసవి కాలంలో వైరస్ ప్రభావం భారీగా తగ్గే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఉదాహరణకు ఆస్ట్రేలియాను తీసుకోవాలని.. అక్కడ ఇప్పటికి 7000 కన్ఫర్మ్ కేసులు నమోదవ్వగా.. 77 మరణాలు మాత్రమే నమోదయ్యాయని అన్నారు. అమెరికాకు చెందిన హెల్త్ ఆథారిటీస్ కూడా వేసవిలో కోవిద్-19 ప్రభావం తగ్గే అవకాశం ఉందని అన్నారు.

Next Story