నేటి నుంచి పాఠశాలలకు సెలవులు.. ప్రభుత్వం ఉత్తర్వులు
By సుభాష్ Published on 24 April 2020 8:48 AM ISTశుక్రవారం నుంచి పాఠశాలలకు సెలవులు ప్రకటించింది ఏపీ సర్కార్. ఏప్రిల్ 23తో ఈ విద్యాసంవత్సరం ముగిసింది. దీంతో పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. జూన్ 12వ తేదీన పునః ప్రారంభం అవుతాయని ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభించడంతో గత నెల 19 నుంచి పాఠశాలలు మూసి ఉన్నాయి. ఇక కరోనాతో వార్షిక పరీక్షలు సైతం నిర్వహించకుండా 6 నుంచి 9వ తరగతి విద్యార్థులను ప్రభుత్వం పై తరగతులకు ప్రమోట్ చేసిన విషయం తెలిసిందే.
కాగా, అన్ని రకాల ఉపాధ్యాయుల డిప్యూటేషన్‌ను రద్దు చేస్తున్నట్లు పాఠశాల కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఉపాధ్యాయులను వెంటనే రిలీవ్ చేయాలని సంబంధిత అధికారులకు డీఈవో ఉత్తర్వులు జారీ చేశారు.
Next Story