మా కూతురు మృతికి వారే కారణం
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 21 Sep 2020 2:25 PM GMT
నేరేడ్‌మెట్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సుమేధ మరణానికి పరోక్షంగా కారణం అయినటువంటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, నగర మేయర్ బొంతు రామ్మోహన్, మల్కాజిగిరి ఎమ్మెల్యే మరియు స్థానిక కార్పొరేటర్, జిహెచ్ఎంసి జోనల్ కమీషనర్, మల్కాజిగిరి డిప్యూటీ కమీషనర్, ఏఈ, డిఈ లపై హత్యా కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని నేరెడ్‌మేట్ పొలీసులకు బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. సుమేధ మృతికి కారణమైన అందరిపై సెక్షన్ 304 కింద కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు.
ఇదిలావుంటే.. నేరెడ్‌మెట్‌లోని దీన్‌దయాళ్‌నగర్‌లో సరదాగా సైకిల్‌పై బయటకు వెళ్లిన చిన్నారి సుమేధ (12) ప్రమాదవశాత్తు నాలాలో పడి మృతి చెందింది. రంగంలోకి దిగిన రెస్క్యూ టీం నాలా వెంట వెతగ్గా.. నాలాలో బాలిక సైకిల్ కనిపించింది. ఆ నాలా వెంబడి రెండు కిలోమీటర్ల దూరంలోని బండ చెరువు దాకా గాలించగా అక్కడ బాలిక మృతదేహాన్ని దొరికింది. ఆడుకోడానికి వెళ్లిన కూతురుని మృత్యువు కబళించడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు.