పోతావురరేయ్.. పోతావ్ అంటున్న సుమక్క
By రాణి Published on 25 March 2020 2:20 PM ISTసుమ..బుల్లితెరపై పరిచయం అక్కర్లేని పేరు. ఏ ప్రోగ్రాం జరిగినా..అందులో యాంకర్ గా సుమ ఉంటే చాలు. ఆ మజా నే వేరు. అందుకే సుమ కాల్షీట్ల కోసం పండగొస్తే చాలు బుల్లితెర ఛానెళ్లన్నీ పోటీపడుతుంటాయి. ఇక వారానికోసారి వచ్చే సుమ ప్రోగ్రాంకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. బుల్లితెర క్వీన్ గా పేరు సంపాదించుకున్న సుమ..యాంకర్లలో తనకంటూ ఓ ప్రత్యేకత ఏర్పరచుకుంది.
Also Read : కరోనాను కట్టడి చేసేందుకు మహేష్ ఆరు సూత్రాలు
కాగా..ఈ మధ్య కాలంలో కరోనా వైరస్ పేరు చెప్తే చాలు. భయపడని వారంటూ లేరు. ఇంట్లో వారికో..స్కూల్లో టీచర్ కో, ఆఫీస్ లో బాస్ తో అయినా అప్పుడప్పుడూ సరదాగా చెప్పుంటారు గానీ..ఈ కరోనాతో వ్యవహారం అంత సరదా కాదు. దానితో సరదాపడాలంటే దాదాపు ప్రాణం పోయినంత పనైనట్లే. అందుకే మన ప్రభుత్వాలు వారంరోజులపాటు లాక్ డౌన్ ప్రకటించి ఎవరినీ బయట తిరగొద్దని చెప్తే..చాలా మంది అవసరం లేకపోయినా రోడ్లపై పడి తిరుగుతున్నారు.
Also Read : జొమాటో ట్వీట్ కు అదిరిపోయే రెస్పాన్స్
ఇలా వార్తలు చూసిన సుమక్కకు కోపం వచ్చింది. అంతే..వెంటనే ట్విట్టర్ లో వీడియో పోస్ట్ చేసింది. ‘‘గవర్నమెంట్స్ ఆర్డర్స్‌ని పాటిస్తూ మీలాగా, నాలాగా చాలామంది బాధ్యతాయుతంగా ఇళ్లకే పరిమితమయ్యారు. కొంతమంది మాత్రం బాధ్యతారహితంగా ఇంకా రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. ఏమంత అర్జెంట్ పని.. రోడ్ల మీదకు వెళ్ళడానికి.. పోతావురరేయ్.. పోతావ్.. అని డిక్లేర్ చేస్తూనే ఉన్నారా..
Also Read : ‘RRR’ టైటిల్ లోగో వచ్చేసింది
గవర్నమెంట్ అఫీషియల్స్, హెల్త్ వర్కర్స్, కమ్యూనిటీ వర్కర్స్, డాక్టర్లు, నర్సులు, పోలీసు, మీడియా వీళ్లంతా వాళ్ల ప్రాణాల్ని రిస్కులో పెట్టి వర్క్ చేస్తున్నారు. ఇలాంటి పనులలో లేని వాళ్లు ఇళ్లకి పరిమితం అవొచ్చుకదా.. అలాగే ఫారెన్ కంట్రీస్ నుంచి వచ్చి గుట్టు చప్పుడు కాకుండా వాళ్లని వాళ్లు డిక్లేర్ చేసుకోకుండా ఇళ్ళకి పరిమితమైన వాళ్లు ఇప్పటికైనా మీ గురించి డిక్లేర్ చేసినట్టైతే.. అది మీరు మన భారతదేశానికి చేసే చాలా పెద్ద ఉపకారం అవుతుంది. కరోనా వ్యాపించకుండా ఉంటుంది. Please stay at Home.. stay safe’’..
Also Read : కరోనా భయం: యువకుడు ఆత్మహత్య
అని ఆ వీడియోలో చెప్పింది. తర్వాత ఏమనుకుందో ఏమో గానీ..ఆ వీడియోను డిలీట్ చేసేసింది మన సుమక్క. ఏదేమైనా ప్రభుత్వాలు చెప్తుంటే ఎలాగూ వినట్లేదు. కనీసం సెలబ్రిటీలు చెప్తే అయినా వారి అభిమానులు వింటారన్నది సెలబ్రిటీల తాపత్రయం.