జొమాటో ట్వీట్ కు అదిరిపోయే రెస్పాన్స్

By రాణి  Published on  25 March 2020 6:43 AM GMT
జొమాటో ట్వీట్ కు అదిరిపోయే రెస్పాన్స్

కరోనా ప్రభావంతో దేశమంతా లాక్ డౌన్ అయింది. బుధవారం నాటికి దేశంలో కరోనా కేసులు 562కు పెరిగాయి. మంగళవారం రాత్రికి 521 గా ఉన్న కేసులు తెల్లవారేసరికి 40కి పైగా పాజిటివ్ కేసులు రిజిస్టర్ అయ్యాయి. కాగా..కరోనా వైరస్ రోజురోజుకూ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ 21 రోజులవరకూ దేశమంతా లాక్ డౌన్ లో ఉండాలని ఆదేశించారు. మంగళవారం రాత్రి జాతినుద్దేశించి ప్రసంగించిన మోదీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అత్యవరసమైతే తప్ప బయట తిరగవద్దని వారించారు. కరోనా ధాటికి అన్ని వ్యాపార సంస్థలు మూతపడ్డాయి.

Also Read : కరోనా వ్యాక్సిన్.. 108 మందిపై ట్రయల్స్..!

టిఫిన్ సెంటర్లు, రెస్టారెంట్లను సైతం మూసివేయాల్సిందేనని ఆదేశాలు రావడంతో..ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్ కూడా తమ బిజినెస్ ను ఆపక తప్పలేదు. అందులోనూ డెలివరీ బాయ్స్ కూడా కరోనా భయంతో గడపదాటడం లేదు. దీంతో బాగా పాపులర్ అయిన్ జొమాటో ఫుడ్ డెలివరీ యాప్ ఒక వినూత్నమైన ఆలోచనతో ముందుకొచ్చింది. జొమాటో ట్విట్టర్ అధికారిక ఖాతాలో మీ ఇంట్లో మీరు బాగా చేసే వంటకాలను పోస్ట్ చేయండి అని ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ కు ఊహించని స్పందన వచ్చింది.



చాలా మంది మహిళా ఉద్యోగులు ఆఫీసులకు సెలవులివ్వడంతో ఇంటికే పరిమితమయ్యారు. కేవలం మహిళలే కాదు..హోమ్ క్వారంటైన్ లో ఉన్న పురుషులు కూడా ఈ ట్వీట్ కు రెస్పాన్డ్ అయ్యారు. నోరూరించే వంటకాల తయారీలను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.



Next Story