వ్యాపారుల ఆత్మహత్యలు.. షాకింగ్ సర్వే

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  11 Sep 2020 10:15 AM GMT
వ్యాపారుల ఆత్మహత్యలు.. షాకింగ్ సర్వే

ప్రతి ఏటా సెప్టెంబరు 10న ఆత్మహత్యల నివారణ దినోత్సవం జరుపుకుంటుంటారు. ఈ విషయం చాలామందికి తెలియకపోవచ్చు. ఒకవేళ తెలిసినా.. రైతుల ఆత్మహత్యలు ప్రధానం చర్చకు వస్తాయి. అయితే, చాలామందికి తెలియని విషయం ఏంటంటే రైతులతో పాటు దాదాపుగా అదే సంఖ్యలో వ్యాపారుల ఆత్మహత్యలు గణనీయంగా పెరుగుతున్నాయి.

కరోనా, ఆర్థిక సంక్షోభం రాకముందే 2019లో వ్యాపారుల ఆత్మహత్యల సంఖ్య కలవరపెడుతోందని నేషనల్ క్రైమ్ రికార్డు బ్యూరో డేటాలో వెల్లడైంది. 2019లో 9052 మంది వ్యాపారులు ఆత్మహత్య చేసుకున్నారు. అంటే ప్రతి రోజు 24 మంది వ్యాపారులు బలవన్మరణానికి పాల్పడుతుండడం ఆందోళన కలిగించే అంశం. 2019లో వ్యాపారుల ఆత్మహత్యల శాతం 13.3 కాగా, 2018లో 2.7 కావడం ఆశ్చర్యకరం. 2019లో 10281 రైతులు ఆత్మహత్యలు చేసుకోగా.. 2018లో 10349 రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.

2018తో పోలిస్తే 2019లో భారీగా ఎకానమీ పడిపోయింది. 2016లో నోట్ల రద్దు, 2017లో వచ్చాక జీడీపీ వృద్ధి రేటు పడిపోయింది. 2019లో జీడీపీ 4.2 శాతం మాత్రమే. ఇటీవల కాలంలో ఏనాడు ఇంత తక్కువ నమోదు కాలేదు. 1980లలో కూడా సగటు వద్ది రేటు 5 శాతం. ఆర్థిక సంక్షోభంలో చాలా వ్యాపారులు నష్టపోయారు. జియో వ్యాపారం 183 శాతం డెవలప్ అయింది. అది పెద్ద గ్రూప్ ఆఫ్ కంపెనీస్. కానీ, ఎన్ని వ్యాపారాలు మునిగితే 4.2 శాతానికి జీడీపీ వద్ది రేటు పడిపోతుంది? కొన్ని వేల కుటుంబాలు 2018-19 కాలంలో దివాలా తీశాయి. ఆర్థిక ఒత్తిడి వల్లే వ్యాపారలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పంట వైఫల్యం, అప్పుల భారంతో రైతులు సూసైడ్ చేసుకుంటున్నారు.

నోట్ల రద్దుతో చిన్న చిన్న వ్యాపారాలు దివాలా తీశాయి. వ్యాపారంలో నష్టాలు వచ్చాయని చెబితే అప్పు పుట్టదు...అప్పులు రావు.. పరపతి పోతుంది.. గౌరవం పోతుంది.. కాబట్టి వారు వ్యాపారులు ఆత్మహత్యే శరణ్యమని భావించారు. ఇదంతా 2018-19 మధ్య సంగతి. ఇపుడు కరోనా కాలం. ఇపుడు చవిచూస్తున్న ఆర్థిక మాంద్యం కన్నా భయంకరమైన ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కోబోతున్నాం. 2020-21లో ఇంకా ఘోరంగా ఉండే అవకాశం ఉంది. 2021లో జీడీపీ -10 శాతం ఉంటుందా అన్నది తేలాల్సి ఉంది. 2020 తొలి త్రైమాసికానికి జీడీపీ ఘోరంగా -23.9 శాతం నమోదైంది. కరోనా దెబ్బకు చాలామంది వ్యాపారలు, వృత్తులు, ఉద్యోగాలు పోయాయి. దాదాపు 2 కోట్ల ఉద్యోగాలు పోయాయని అంచనా. వీటన్నింటిపై కేంద్రం 'ఎకానమీ కమిషన్'వంటిది ఏర్పాటు చేసి వారిని ఆదుకునే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Next Story