సీఎం జగన్ సలహాదారుగా రాజస్థాన్ కేడర్‌కు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి
By న్యూస్‌మీటర్ తెలుగు Published on : 2 March 2020 6:52 PM IST

ఏపీ సీఎం వైఎస్ జగన్ సలహాదారుడుగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సుభాష్ చంద్ర గార్గ్‌ను ప్రభుత్వం నియమించింది. ఆర్థిక వనరుల సమీకరణ వ్యవహారాల నిమిత్తం ఆయనను నియమిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ అయ్యాయి. కేబినెట్ హోదా కలిగిన ఈ పదవిలో సుభాష్ చంద్ర గార్గ్ రెండేళ్ల పాటూ కొనసాగుతారు.
సుభాష్ చంద్ర గార్గ్ గతంలో కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శిగా పనిచేశారు. ఆయన 1983 రాజస్థాన్ కేడర్ కు చెందిన ఐఏఎస్ అధికారి. ఆయన ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా, ప్రపంచబ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కూడా విధులు నిర్వర్తించారు. సీఎం జగన్ ప్రభుత్వం .. పాలనా సౌలభ్యం కొరకు గతంలో కూడా పలువురు సలహాదారుల్ని నియమించింది.
Next Story