12 రోజుల్లో.. 8,004 వాహనాలు సీజ్‌

By అంజి  Published on  4 April 2020 2:45 AM GMT
12 రోజుల్లో.. 8,004 వాహనాలు సీజ్‌

హైదరాబాద్‌: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల లాక్‌డౌన్‌ ఆదేశాలను పట్టించుకోకుండా రోడ్లపైకి వచ్చిన వాహనదారులపై హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. మార్చి 23వ తేదీ నుంచి ఏప్రిల్‌ 3వ తేదీ వరకు 1,34,107 టూ వీలర్స్‌, 3,360 త్రీ వీలర్‌ వాహనాలు, 7,958 ఫోర్‌ వీలర్‌ వాహనాలు రోడ్లపైకి వచ్చాయని ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు. మొత్తం 1,46,258 వాహనాలను సర్వైలైన్స్‌ కెమెరాల ద్వారా గుర్తించి కేసు నమోదు చేశామని తెలిపారు. వీరందరిపై వయోలేషన్‌ యాక్ట్‌ కేసులు నమోదు చేశామని ట్రాఫిక్‌ పోలీసులు.. మీడియాకు తెలిపారు.

Also Read: న్యూయార్క్‌లో మృతదేహాలతో కిక్కిరిసిపోతున్న శ్మశానవాటికలు

దీంతో పాటు ట్రాఫిక్‌ పోలీసులు స్వయంగా స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించారు. ఈ డ్రైవ్‌లో సరైన కారణం లేకుండా రోడ్లపైకి 18,268 టూవీలర్‌ వాహనాలు, 2,238 త్రీవీలర్‌ వాహనాలు, 1587 ఫోర్‌ వీలర్‌ వాహనాలు రోడ్లపైకి వచ్చాయని తెలిపారు. మొత్తం 22,178 వాహనదారులపై కేసులు నమోదు చేశామని తెలిపారు. ఇప్పటి వరకు 7,157 టూ వీలర్‌ వాహనాలు, 538 త్రీ వీలర్‌ వాహనాలు, 309 ఫోర్‌ వీలర్‌ వాహనాలు సీజ్‌ చేశామని హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు.

Also Read: చిరు-నాగ్‌లకు ప్రధాని మోదీ ధన్యవాదాలు..

అలాగే మార్చ్‌ 23 నుంచి ఏప్రిల్‌ 3 వరకు రోడ్లపై త్రిబుల్‌ రైడింగ్‌ వెళ్లిన వారు 43, డబుల్‌ రైడింగ్‌ వెళ్లిన వారు 10,176 మంది, వితౌట్‌ హెల్మెట్‌ లేన వారు 12,724 మంది, రూల్స్‌ వాయిలేషన్‌ చేసిన వారు 5,073 మంది. వీరందరిపై వయోలేషన్‌ యాక్ట్‌ కింద కేసులు నమోదు చేశామని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.

Next Story
Share it