శ్రీశైలం ప్రమాదం కేసులో రంగంలోకి దిగిన సీఐడీ బృందం
By సుభాష్ Published on 24 Aug 2020 7:28 AM GMTశ్రీశైలం ప్రాజెక్టు ఎడమ జల విద్యుత్ కేంద్రంలో జరిగిన ప్రమాదంపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కేసును సీఐడీకి అప్పగించడంతో సీఐడీ చీఫ్ బృందం రంగంలోకి దిగింది. ఇందులో భాగంగా ఈ రోజు ఎడమ జల విద్యుత్ కేంద్రాన్ని తమ బృందంతో పరిశీలించారు. అనంతరం అత్యవసరంగా బయటకు వెళ్లే గేట్‌ను పరిశీలించారు.
ప్రమాదం జరిగిన సమయంలో అత్యవసరమైన గేటు ద్వారా లోపల చిక్కుకున్న 9 మంది ఎందుకు బయటకు రాలేకపోయారని, ఆ సమయంలో అత్యవసరమైన గేటు ద్వారా వద్ద ఏమైనా సమస్యలున్నాయా.. అనే కోణంలో విచారణ కొనసాగిస్తున్నారు. కాగా, ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందడంతో ఈ విషయాన్ని అత్యంత సీరియస్‌గా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. ఈ కేసును సీఐడీకి అప్పగించారు. ఎన్ని రోజుల్లోగా ఈ కేసుకు సంబంధించిన నివేదిక ప్రభుత్వానికి ఇస్తారో తెలియాల్సి ఉంది.
Next Story