టాలీవుడ్ సంచ‌ల‌న‌ నటి శ్రీరెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. గ‌తంలో సినీ ప్రముఖులపై మీటూ ఆరోపణలు చేసి కలకలం సృష్టించిన శ్రీరెడ్డి ప్ర‌స్తుతం చెన్నైలో ఉంటుంది. అయితే.. ఇటీవల తన ఇంటి సమీపంలో హీరోయిన్ తమన్నా నటిస్తున్న వెబ్‌ సిరీస్‌ షూటింగ్‌ను నిర్వహిస్తున్నారనీ.. ఆ యూనిట్‌ గోల భ‌రించ‌లేక‌పోతున్నాని పేస్‌బుక్‌లో పేర్కొంది.

అయితే.. రెండు రోజుల క్రితం శ్రీరెడ్డి కోయంబేడు పోలీస్‌స్టేషన్‌లో ఒక ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులో తన‌ ఇంటి సమీపంలో ఓ రిటైర్డ్‌ పోలీస్‌ అధికారి బంగ్లా ఉందని.. అందులో గత కొన్ని రోజులుగా సినిమా షూటింగ్‌ జరుగుతుంద‌ని.. దీంతో ఆ ప్రాంతంలో పలు కార్లను నిలుపుతున్నారని.. తాను బయటకు వెళ్లి రాత్రి ఇంటికి తిరిగి రాగానే.. తన ఇంటి ముందు ఒక వాహనం నిలిపి ఉండటంతో నా ఆడి కారును బయట పెట్టానని శ్రీరెడ్డి పేర్కొన్నారు.

కొద్దిసేప‌టి త‌ర్వాత చూస్తే నా ఆడి కారుకు గీతలు గీసి ధ్వంసం చేశార‌ని.. ప్రొడ‌క్ష‌న్ మేనేజ‌ర్ మనోజ్‌పై అనుమానం ఉందని పేర్కొన్నారు. ఈ సంఘటనపై విచారణ జర‌పాల‌ని శ్రీరెడ్డి పోలీసుల‌ను కోరింది. కేసు నమోదు చేసుకున్న కోయంబేడు ఇన్‌స్పెక్టర్‌ మాదేశ్వరన్‌ విచారణ జరుపుతున్నారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.