నోరా ఫ‌తేహి.. మ‌రోసారి ఇర‌గ‌దీసింది..!

By Newsmeter.Network  Published on  2 Jan 2020 4:42 AM GMT
నోరా ఫ‌తేహి.. మ‌రోసారి ఇర‌గ‌దీసింది..!

బిగ్ బ్యాంగ్ డ్యాన్స్‌తో బాలీవుడ్ జ‌నాల‌ను హుషారెత్తించిన నోరా ఫ‌తేహి మ‌రోసారి హాట్ టాపిక్ ఆఫ్ ద ఇండ‌స్ట్రీగా నిలిచింది. ఆమెకు సంబంధించిన వీడియో ఒక‌టి ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. ఈ వీడియోలో హీరో వ‌రుణ్ ధావ‌న్ కూడా నోరా ఫ‌తేహితో క‌లిసి స్టెప్పులేశాడు.

అయితే, బుధ‌వారం నాడు యావ‌త్ ప్ర‌పంచం నూత‌న సంవ‌త్స‌రానికి గ్రాండ్ వెల్క‌మ్ చెబుతూ వేడుక‌లు నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే. అందులో భాగంగానే నోరా ఫ‌తేహి ఈ వీడియోను త‌న ఇన్‌స్టా గ్రామ్‌లో షేర్ చేసింది. వ‌రుణ్ ధావ‌ణ్‌, నోరా ఫ‌తేహి క‌లిసి డ్యాన్స్ చేసిన ఈ వీడియో వారి అభిమానుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోంది. నోరా ఫతేహి, వరుణ్ ధావన్ డ్యాన్స్ చేసిన ఈ వీడియోను ఇప్ప‌టి వ‌ర‌కు 10 లక్షల మందికిపైగా వీక్షించారు. వారి స్పంద‌న‌ను కామెంట్ల‌తో నింపేశారు.

త్వరలోనే ఈ ఇద్దరు 'స్ట్రీట్ డాన్సర్' చిత్రం ద్వారా ప్రేక్షకులను ప‌ల‌క‌రించ‌నున్నారు. ఇటీవల, సినిమా షూటింగ్‌లో నోరా ఫతేహిని అభిమానులు చుట్టుముట్ట‌డంతో, వ‌రుణ్ ధావ‌న్ క‌లుగ‌జేసుకుని ఆమెను ఆ భారీ గుంపు నుంచి బ‌య‌ట‌కు పంపిన సంగ‌తి తెలిసిందే. ఆ వీడియో సైతం నెట్టింట తెగ వైర‌ల్ అయింది.

తాజాగా, వీరి క‌ల‌యిక‌లో తెర‌కెక్కుతున్న స్ట్రీట్ డాన్సర్స్ చిత్రం నుంచి 'సమ్మర్' అనే లిరిక్స్ పాట విడుదలై శ్రోత‌ల‌ను అమితంగా ఆక‌ట్టుకుంటోంది. యూట్యూబ్‌లోనూ పెద్ద సెన్షేష‌నే క్రియేట్ చేసింది.

నోరా ఫ‌తేహి బాలీవుడ్ బ‌ఢా హీరోల చిత్రాల్లోనూ న‌టిస్తూ త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపును సంపాదించుకుంది. సల్మాన్ ఖాన్ చిత్రం భ‌ర‌త్‌లోనూ న‌టించిన‌ నోరా ఫతేహి సినీ జ‌నాల‌ను అల‌రించింది. నోరా ఫతేహి నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ త‌న అభిమానుల‌ను అంత‌కంత‌కు పెంచుకుంటోంది.

Next Story
Share it