సంచలన నిర్ణయం: 27న దేశ వ్యాప్తంగా కర్ఫ్యూ ఎత్తివేత
By సుభాష్ Published on 25 April 2020 11:37 AM GMTప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభన అంతా ఇంతా కాదు. దేశ దేశాలను సైతం అతలాకుతలం చేస్తోంది. కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ప్రపంచ దేశాలకు కరోనా వైరస్ పెద్ద శత్రువుగా మారిపోయింది. ఇప్పుడు కరోనా అంటేనే గజగజ వణికిపోతున్నాయి దేశాలు. చైనా జన్మస్థలమైన ఈ వైరస్.. ఏ దేశమనే తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లో చాపకింద నీరులా విస్తరిస్తోంది. కరోనా భయానికి లాక్‌డౌన్ కొనసాగుతున్నాయి. జనాలెవ్వరూ బయటకు రాకుండా ఇళ్లకే పరిమితం అవుతున్నారు.
ఇక కరోనా కట్టడికి శ్రీలంక దేశ వ్యాప్తంగా విధించిన కర్ఫ్యూని ఏప్రిల్ 27న ఎత్తివేస్తున్నట్లు శ్రీలంక పోలీసులు ప్రకటించారు. కర్ఫ్యూ ఎత్తివేతపై శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. మార్చి 20వ తేదీ నుంచి 24 గంటల పాటు కర్ఫ్యూ కొనసాగుతోంది. దీనిని ఏప్రిల్ 27న ఉదయం 5 గంటలక ఎత్తివేస్తామని వెల్లడించారు. శ్రీలంకలో ఇప్పటి వరకూ 414 కరోనా పాటిజివ్ కేసులు నమోదు కాగా, ఏడుగురు మృతి చెందారు. ఇక 24వ తేదీన 49 కరోనా కేసులు నమోదయ్యాయి. దేశంలో ఇదే ఒక్క రోజులోనే అత్యధికంగా నమోదైన కేసులు.