చాహల్ ప‌క్క‌న కూర్చున్న‌ అమ్మాయి ఎవ‌రో తెలుసా..?

భారత జట్టు లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్.. కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ అధికారికంగా విడాకులు తీసుకున్నారు.

By Medi Samrat
Published on : 10 March 2025 9:16 AM IST

చాహల్ ప‌క్క‌న కూర్చున్న‌ అమ్మాయి ఎవ‌రో తెలుసా..?

భారత జట్టు లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్.. కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ అధికారికంగా విడాకులు తీసుకున్నారు. పెళ్లయిన నాలుగేళ్ల తర్వాత ఇద్దరూ విడిపోయారు. విడాకుల తర్వాత ఇద్దరూ తమ వ్యక్తిగత, ఒంటరి జీవితాన్ని ఆనందిస్తున్నారు. నిన్న అంటే మార్చి 9న ఇండియా vs న్యూజిలాండ్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో యుజ్వేంద్ర చాహల్ స్టేడియంలో మెరిశాడు. ఒక మిస్టరీ భామ‌తో చాహల్‌తో స్టేడియంలో కనిపించాడు. ఆ అమ్మాయి పక్కన కూర్చుని చాహల్‌ మ్యాచ్‌ను ఆస్వాదించాడు. ప్ర‌స్తుతం వీరి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చాహల్ ఈ బ్యూటీతో డేటింగ్ చేస్తున్నాడని ఊహాగానాలు వెలువ‌డుతున్నాయి. ఈ మిస్టరీ గర్ల్ ఎవరో తెలుసుకుందాం.?

ధనశ్రీతో విడాకుల తర్వాత యుజ్వేంద్ర చాహల్.. RJ మహ్వాష్‌తో క్లోజ్‌గా ఉంటున్నాడ‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. వీరిద్ద‌రి డేటింగ్ గురించిన వార్త‌లు శ‌ర‌వేగంగా వ్యాపించాయి. యుజ్వేంద్ర చాహల్, RJ మహ్వాష్‌ క్రిస్మస్ సందర్భంగా ఒక విందులో.. తరువాత పార్టీలో కలిసి కనిపించడంతో ఈ విషయం ఊపందుకుంది. కానీ RJ మహ్వాష్‌ మాత్రం తామిద్ద‌రం స్నేహితులమ‌ని పేర్కొంది.

ఇప్పుడు మళ్లీ మిస్టరీ గర్ల్ RJ మహ్వాష్ భారత్-న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ చూడటానికి చాహల్‌తో కలిసి దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం చేరుకుంది. వారిద్దరి వీడియోలు, ఫోటోలు వేగంగా వైరల్ అయ్యాయి. దీంతో మిస్టరీ గ‌ర్ల్ ఎవ‌ర‌నే విష‌య‌మై జ‌నాలు ఇంట‌ర్‌నెట్‌లో వెత‌క‌డం ప్రారంభించారు.

ఢిల్లీకి చెందిన రేడియో జాకీ అయిన ఈ మిస్టరీ గర్ల్ పేరు RJ మహ్వాష్. ఆమె సోషల్ మీడియాలో కంటెంట్ క్రియేషన్ వర్క్ కూడా చేస్తుంది. ఆమె మధురమైన స్వరం, ఎంట‌ర్‌టైన్‌మెంట్ చాలా ప్రసిద్ధి చెందింది. మహ్వాష్‌కి బిగ్ బాస్, నెట్‌ఫ్లిక్స్‌లో ఒక సిరీస్‌లో పనిచేయడానికి ఆఫర్ వచ్చిందని, అయితే కొన్ని కారణాల వల్ల ఆమె చేయలేకపోయిందని కూడా నివేదికలు ఉన్నాయి. అదే సమయంలో ఆమె సెక్షన్ 108 అనే చిత్రాన్ని కూడా నిర్మించింది.

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్‌లో భారత జట్టు 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించి మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను గెలుచుకుంది. టైటిల్ విజయం తర్వాత RJ మహ్వాష్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను షేర్ చేసింది. అందులో ఆమె.. గెలిచిన తర్వాత వస్తాను అని క్యాప్షన్‌లో రాసింది. టీమ్ ఇండియాకు నేను అదృష్టం అని నవ్వుతున్న ఎమోజీలను జోడించింది.

Next Story