అలవాటైపోయింది.. ప్రపంచకప్‌కు ఎంపిక కాకపోవడంపై స్పందించిన యుజ్వేంద్ర చాహల్..!
భారత జట్టు లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ 2023 ప్రపంచకప్‌కు ఎంపిక కాకపోవడంపై ఎట్టకేలకు మౌనం వీడాడు.
By Medi Samrat Published on 1 Oct 2023 2:41 PM ISTభారత జట్టు లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ 2023 ప్రపంచకప్‌కు ఎంపిక కాకపోవడంపై ఎట్టకేలకు మౌనం వీడాడు. చాహల్ నిరాశను వ్యక్తం చేశాడు. తను విస్మరించబడటాన్ని అలవాటు చేసుకున్నానని చెప్పాడు. అంతకుముందు యుజ్వేంద్ర చాహల్ 2021 T20 ప్రపంచ కప్ జట్టుకు కూడా ఎంపికవలేదు. అయితే.. టీ20 ప్రపంచ కప్ 2022కి ఎంపికయ్యాడు. కానీ ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. 2023 ODI ప్రపంచ కప్ లో చాహల్ కు బదులు కుల్‌దీప్ యాదవ్‌కు ప్రాధాన్యత ఇవ్వబడింది.
ప్రస్తుతం ఇంగ్లండ్‌లో కౌంటీ క్రికెట్‌లో ఆడుతున్న యుజ్వేంద్ర చాహల్ విజ్డన్‌తో మాట్లాడుతూ.. తనను జట్టు నుంచి తొలగించడం.. అలవాటు చేసుకున్నానని.. అది తన జీవితంలో భాగమైందని చెప్పాడు. ఇది ప్రపంచ కప్ కాబట్టి కేవలం 15 మంది ఆటగాళ్లు మాత్రమే పాల్గొనగలరని నేను అర్థం చేసుకున్నాను. 17 లేదా 18 మంది ఆటగాళ్లను ఎంచుకోలేరు. నాకు కొంచెం బాధగా అనిపించినా.. ముందుకు సాగడమే నా జీవిత లక్ష్యం. ఇప్పుడు మూడు ప్రపంచకప్‌లు జరిగినందున నన్ను జట్టు నుంచి తప్పించడం అలవాటు.
ఇంట్లో ఖాళీగా కూర్చోవడం ఇష్టం లేకనే కౌంటీ క్రికెట్ ఆడేందుకు వచ్చానని చాహల్ తెలిపాడు. వేరే చోట క్రికెట్ ఆడాలనే కోరికతో క్రికెట్ ఆడేందుకు కెంట్ వచ్చాను. ఇక్కడ నాకు ఎర్ర బంతితో ఆడే అవకాశం లభించింది. నిజంగా భారత్ తరఫున టెస్టు ఆడాలనుకుంటున్నాను. కాబట్టి ఇక్కడి అనుభవం నాకు ఉపయోగపడుతుంది. నేను కోచ్‌తో మాట్లాడాను. నేను క్రికెట్ ఆడుతున్నందుకు ఆయన సంతోషంగా ఉన్నాడు. నెట్స్‌లో ఎంత కష్టపడినా మ్యాచ్‌లో వేరు. ఇక్కడ మంచి స్థాయిలో ఆడుతున్నాను. నేను ఇక్కడ చాలా నేర్చుకుంటున్నాను అని చాహల్ పేర్కొన్నాడు.