చాహల్‌ను కూలీని చేసిన ధనశ్రీ.. వీడియో వైర‌ల్‌

Yuzvendra Chahal becomes ‘Coolie’ for Dhanashree Verma.శిఖ‌ర్ ధావ‌న్ ఓ వీడియోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  29 Nov 2022 3:02 PM IST
చాహల్‌ను కూలీని చేసిన ధనశ్రీ.. వీడియో వైర‌ల్‌

న్యూజిలాండ్‌తో మూడు వ‌న్డేల‌ సిరీస్‌లో భాగంగా ఆఖ‌రి వ‌న్డే స‌మ‌రానికి టీమ్ఇండియా సిద్ద‌మ‌వుతోంది. తొలి వ‌న్డే ఓడ‌గా, రెండో వ‌న్డే వ‌ర్షం కార‌ణంగా ర‌ద్దు కావ‌డంతో సిరీస్‌లో 0-1తో వెన‌క‌బ‌డి ఉన్న భార‌త్ క్రైస్ట్‌చ‌ర్చ్ వేదిక‌గా జ‌రిగే ఆఖ‌రి వ‌న్డేలో గెలిచి సిరీస్‌ను 1-1తో స‌మం చేయాల‌ని అభిమానులు కోరుకుంటున్నారు.

ఈ క్ర‌మంలో భార‌త ఆట‌గాళ్లు త‌మ భార్య‌ల‌ను తీసుకుని క్రైస్ట్‌చ‌ర్చ్ కు బ‌య‌లుదేరారు. ఈ సంద‌ర్భంగా కెప్టెన్ శిఖ‌ర్ ధావ‌న్ ఓ వీడియోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్ర‌స్తుతం ఈ వీడియో వైర‌ల్‌గా మారింది.

ఈ వీడియోలో ఏం ఉందంటే..? విమానాశ్ర‌యం ద‌గ్గ‌ర స్పిన్న‌ర్ చాహ‌ల్ రెండు చేతుల్లో ల‌గేజ్‌ను మోసుకుంటూ వ‌స్తుంటాడు. అత‌డి వెన‌క చాహ‌ల్ భార్య ధ‌న‌శ్రీ వ‌ర్మ త‌క్కువ ల‌గేజీతో వ‌స్తుంటుంది. దీన్ని చూపిస్తూ ధావ‌న్ వాళ్ల‌ని ఆట‌ప‌ట్టించాడు. చాహల్‌ను ధనశ్రీ అప్పుడే కూలీని చేసేసింది అంటూ సరదాగా అన్నాడు. ఈ వీడియో నెట్టింట నవ్వులు పూయిస్తోంది.

Next Story