రోహిత్‌, పంత్‌ రికార్డును బ్రేక్ చేసిన యశస్వి జైస్వాల్

కెప్టెన్ రోహిత్ శర్మ, రిషబ్ పంత్, తిలక్‌ వర్మ పేరిట ఉన్న సంయుక్త రికార్డును అధిగమించాడు యశస్వి జైస్వాల్.

By Srikanth Gundamalla  Published on  16 Jan 2024 4:52 AM GMT
yashasvi jaiswal, team india, cricket, rohit,

 రోహిత్‌, పంత్‌ రికార్డును బ్రేక్ చేసిన యశస్వి జైస్వాల్

ప్రస్తుతం టీమిండియా ఎంతో పటిష్టమైన ఆటగాళ్లను కలిగి ఉంది. భారత్‌లో ఉన్న ఆటగాళ్లతో ఒకటి కాదు.. ఏకంగా రెండు టీమ్‌లు కూడా నెలకొల్పవచ్చు. అంత మంది రాణిస్తున్న బ్యాటర్లు.. బౌలర్లు ఉన్నారు. అయితే.. యశస్వి జైస్వాల్‌ గురించి అందరికీ తెలిసిందే. ఇటీవల అప్ఘానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో రాణించిన ఈ యువ ఓపెనర్.. ఒక విషయంలో టీమిండియా కెప్టన్ రోహిత్, రిషబ్‌ పంత్‌లను అధిగమించాడు. అప్ఘాన్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌ తర్వాత యశస్వి జైస్వాల్ సాధించిన ఘనతకు సంబంధించి విశేషాలు బయటకు వచ్చాయి. 23 ఏళ్ల వయసు దాటక ముందే టీ20ల్లో అత్యధిక హాఫ్‌ సెంచరీలు చేసిన భారత బ్యాటర్‌గా యశస్వి జైస్వాల్‌ పేరు లిఖించుకున్నాడు.

భారత్ క్రికెట్ కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ఆటగాడు రిషబ్ పంత్, తిలక్‌ వర్మ పేరిట ఉన్న ఈ సంయుక్త రికార్డును అధిగమించాడు యశస్వి జైస్వాల్. అయితే.. రోహిత్ శర్మ, రిషబ్ పంత్, తిలక్‌ ముగ్గూరు 23 ఏళ్లు దాటక ముందు రెండు హాఫ్‌ సెంచరీలు నమోదు చేశారు. కానీ.. 22 ఏల్లు ఉన్న యశస్వి జైస్వాల్‌ ఇప్పటికే ఏకంగా 4 హాఫ్‌ సెంచరీలు చేశాడు. అంతేకాదు.. ఒక సెంచరీ కూడా యశస్వి ఖాతాలో ఉంది. 16 టీ20 మ్యాచ్‌లు ఆడిన అతను 163.83 స్ట్రైక్‌ రేట్‌తో 498 పరుగులు చేశాడు.

ప్రస్తుతం టీమిండియా భారత్ వేదికగా అప్ఘానిస్థాన్‌తో మూడు టీ20 మ్యాచ్‌ల సరీస్‌ ఆడుతోంది. 2-0తో ఇప్పటికే సిరీస్‌ను కైవసం చేసుకుంది టీమిండియా. ఈ రెండో టీ20లో 34 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్‌లు కొట్టి 68 పరుగులు చేశాడు యశస్వి జైస్వాల్. టీమిండియా గెలుపులో కీలక పా్తర పోషించాడు. యశస్వి జైస్వాల్‌తో పాటు శివమ్‌ దూబె కూడా మెరుపు ఇన్నింగ్స్‌తో 63 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. తద్వారా రెండో టీ20 మ్యాచ్‌లో భారత్‌ అప్ఘాన్‌పై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇక నామమాత్రపు మూడో టీ20 బెంగళూరు వేదికగా జనవరి 17న జరుగనుంది.


Next Story