WWC: ఆస్ట్రేలియాపై అద్భుత విజయం.. ఫైనల్‌కు భారత్‌.. ఈ సారి ఎవరు గెలిచినా చరిత్రే

ఉమెన్స్‌ వన్డే వరల్డ్‌ కప్‌ సెమీ ఫైనల్‌లో ఆస్ట్రేలియాపై భారత్‌ విజయం సాధించింది. దీంతో భారత్‌ జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది.

By -  అంజి
Published on : 31 Oct 2025 6:36 AM IST

Jemimah Rodrigues, India, final, Australia, Womens World Cup, IND vs AUS

WWC: ఆస్ట్రేలియాపై అద్భుత విజయం.. ఫైనల్‌కు భారత్‌.. ఈ సారి ఎవరు గెలిచినా చరిత్రే

ఉమెన్స్‌ వన్డే వరల్డ్‌ కప్‌ సెమీ ఫైనల్‌లో ఆస్ట్రేలియాపై భారత్‌ విజయం సాధించింది. దీంతో భారత్‌ జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. సౌతాఫ్రికాతో టైటిల్‌ పోరుకు సిద్ధమైంది. నవీ ముంబై వేదికగా నవంబర్‌ 2వ తేదీన ఫైనల్‌ జరగనుంది. భారత్‌, సౌతాఫ్రికా జట్లు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా వరల్డ్‌ కప్‌ గెలవలేదు. ఈసారి ఎవరు విజేతగా నిలిచినా అది ఆ జట్టుకు తొలి వరల్డ్‌కప్‌గా చరిత్రలో నిలుస్తుంది.

మొదట బ్యాటింగ్‌కు దినగ ఆస్ట్రేలియా 49.5 ఓవర్లకు 338 పరుగులు చేసి ఆల్‌ అవుట్‌ అయ్యింది. లిచ్‌ఫీల్డ్‌ సెంచరీ (119) చేయగా, పెర్రీ (77), గార్డ్‌నర్‌ (63) హాఫ్‌ సెంచరీలతో రాఇంచారు. భారత బౌలర్లలో దీప్తి, చరణి చెరో 2 వికెట్లు, క్రాంతి, అమన్‌ జ్యోత్‌, రాధా యాదవ్‌ తలో వికెట్‌ తీశారు. భారత్‌ ఇన్నింగ్స్‌ విషయానికొస్తే.. 339 పరుగుల భారీ లక్ష్యాన్ని 48.3 ఓవర్లలో భారత్‌ ఛేదించింది. జెమీమా సూపర్‌ సెంచరీ (127*)తో విజయంలో కీలక పాత్ర పోషించారు. కెప్టెన్‌ హర్మన్‌ హాఫ్‌ సెంచరీ (89)తో రాణించగా చివర్లో రిచా ఘోష్‌ (26), దీప్తి(24) ధనాధన్‌ ఇన్సింగ్స్‌ ఆడారు.

ఆస్ట్రేలియాపై గెలుపుతో భారత ప్లేయర్లు భావోద్వేగానికి గురయ్యారు. హర్మన్‌ ప్రీత్‌, జెమీమా రోడ్రిగ్స్‌తో పాటు ఇతర ప్లేయర్లు, సపోర్ట్‌ స్టాఫ్‌ కన్నీళ్లు పెట్టుకున్నారు. వరల్డ్‌కప్‌ గెలవడం కోసం చాలా ఏళ్లుగా హార్డ్‌ వర్క్‌ చేస్తున్నామని, టీమ్‌ ఆడిన తీరుపట్ల గర్వంగా ఉందని హర్మన్‌ తెలిపారు. చాలా సార్లు కీలక మ్యాచుల్లో ఓడామని, ఈ సారి ఎలాగైనా దేశాన్ని గెలిపించాలనుకుంటున్నట్టు జెమీమా తెలిపారు.

Next Story