టాస్ గెలిచిన కివీస్.. భారత్ 5/0
WTC Final New zealand have won the toss.క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్
By తోట వంశీ కుమార్ Published on 19 Jun 2021 9:40 AM GMTక్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ పైనల్ ప్రారంభమైంది. తొలి రోజు వర్షం కారణంగా కనీసం టాస్ వేయడానికి కూడా వీలు పడలేదు. అయితే.. రెండో రోజు వరుణుడు తెరిపినివ్వడంతో మ్యాచ్ సమయానికే ప్రారంభమైంది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్ సన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. చల్లటి వాతావరణం, పరిస్థితులను ఉపయోగించుకుని ధీమా వ్యక్తం చేశాడు. దీంతో తొలుత భారత జట్టు బ్యాటింగ్ ప్రారంభించింది. భారత జట్టు మ్యాచ్ కు ఒక రోజు ముందే భారత జట్టును ప్రకటించగా.. ఆ జట్టులో ఎటువంటి మార్పులు చేయలేదు.
ప్రపంచ టెస్టు ఛాంపియన్ ఫైనల్ మ్యాచ్‌లో తొలి ఓవర్‌ను టీమ్ సౌథీ వేయగా.. తొలి బంతిని హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఎదుర్కొన్నాడు. ఫ్యాడ్స్‌పై దూసుకువచ్చిన బంతిని రోహిత్.. స్కోయర్ లెగ్ దిశగా ఆడగా మూడు పరుగులు వచ్చాయి. రెండు ఓవర్లు ముగిసే సరికి భారత్ 5/0. రోహిత్ శర్మ 5 పరుగులతో, శుభ్‌మన్ గిల్ (0) పరుగులతో క్రీజులో ఉన్నారు.
భారత జట్టు : రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, పుజారా, విరాట్ కోహ్లీ(కెప్టెన్), రహానె, రిషబ్ పంత్(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, అశ్విన్, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ, బుమ్రా
న్యూజిలాండ్: టామ్ లాథమ్, డేవన్ కాన్వే, కేన్ విలియమ్సన్(కెప్టెన్), రాస్ టేలర్, హెన్రీ నికోల్స్, బీజే వాట్లింగ్, కోలిన్ డీ గ్రాండ్‌హోమ్, కైల్ జేమీసన్, నీల్ వాగ్నర్, టిమ్ సౌథీ, ట్రెంట్ బౌల్ట్