తనను రేప్ చేశారని చెప్పిన టెన్నిస్ క్రీడాకారిణి అదృశ్యం.. చైనాపై టెన్నిస్ ప్రపంచం గుస్సా
WTA suspends tennis tournaments in China over Peng Shuai case. చైనీస్ స్టార్ టెన్నిస్ ప్లేయర్ పెంగ్ షుయ్ అదృశ్యం గురించి తీవ్రమైన చర్చ కొనసాగుతోంది.
By Medi Samrat Published on 3 Dec 2021 1:55 PM GMTచైనీస్ స్టార్ టెన్నిస్ ప్లేయర్ పెంగ్ షుయ్ అదృశ్యం గురించి తీవ్రమైన చర్చ కొనసాగుతోంది. ఆమె అదృశ్యం కావడానికి ముందు ఆమె చైనాలో అధికార కమ్యూనిస్టు పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడిపై సంచలన ఆరోపణలు చేశారు. అతడు తనను బెదిరించి రేప్ చేశాడని ఆమె ఆరోపించారు. తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు పెంగ్ షువాయి నవంబర్ 2న సంచలన ఆరోపణలు చేసింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే వెంటనే ఆ పోస్టును డిలీట్ చేసింది. ఆమె ఏరోజైతే పోస్ట్ డిలీట్ చేసిందో ఆరోజు నుంచి కనిపించకుండా పోయింది. పెంగ్ షుయ్‌ని చైనా ప్రభుత్వమే ఏదో చేసిందనే ఊహాగానాలు వినిపించాయి. ఆమె అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ చైర్మన్ థామస్ బాచ్‌తో పెంగ్ షుయ్ అరగంట పాటు వీడియో కాల్ ద్వారా మాట్లాడారు. తన ఆరోగ్యం బాగానే ఉందని.. తనకు ఏమీ కాలేదని పెంగ్ షుయ్ చెప్పుకొచ్చింది. కానీ పెంగ్ షుయ్ వీడియో కాల్ లో మాట్లాడినా.. ఆమె ఎందుకు బయట ప్రపంచానికి దూరంగా ఉందో చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఆమె ఎక్కడ ఉన్నా వెంటనే ప్రజల ముందుకు తీసుకొని రావాలని డిమాండ్లు వినిపిస్తూ ఉన్నాయి. డబ్ల్యూటీఏ చైర్మన్ స్టీవ్ సైమన్ కూడా వెంటనే ఆమె అదృశ్యంపై విచారణ జరపాలని చైనా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
పెంగ్ షుయ్ ఆచూకీ చెప్పాల్సిందేనంటూ వుమెన్స్ టెన్నిస్ అసోసియేషన్(WTA) చైనాకు అల్టిమేటం జారీ చేసింది. ఆమె ఆచూకీ చెప్పేవరకు చైనాలో జరగాల్సిన అంతర్జాతీయ పోటీలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించి డబ్ల్యూటీఏ తెలిపింది. హాంకాంగ్‌లలో జరగాల్సిన అన్ని డబ్ల్యుటీఏ టోర్నమెంట్‌లను తక్షణమే రద్దు చేస్తున్నట్లు ప్రకటించామని.. పెంగ్ షుయ్ ను ఆడేందుకు అనుమతించారు.. కానీ, లైంగిక వేధింపుల ఆరోపణల నుంచి వెనక్కి తగ్గాలని ఒత్తిడి చేస్తున్నట్లు WTA చైర్మన్, CEO స్టీవ్ సైమన్ తెలిపారు. పెంగ్ షుయ్ స్వేచ్ఛగా, సురక్షితంగా ఎలాంటి ఒత్తిడిలో లేదనే సందేహాలు తమకు ఉన్నాయని అన్నారు. ఈ విషయం నుంచి మనం తప్పుకుంటే.. లైంగిక వేధింపుల కేసులను పట్టించుకోవద్దని, విషయం తీవ్రతను అర్థం చేసుకోవద్దని ప్రపంచానికి సందేశం ఇస్తున్నట్లు అనిపిస్తుందని ఆయన అన్నారు.