హ‌త్య‌కేసులో రెజ్లర్ సుశీల్‌ కుమార్ అరెస్ట్‌

Wrestler SushilKumar Arrested By Delhi Police. భారత రెజ్లర్‌, ఒలంపిక్ ప‌త‌క విజేత‌ సుశీల్‌ కుమార్‌ను ఢిల్లీ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు.

By Medi Samrat  Published on  23 May 2021 2:06 PM IST
Wrestler SushilKumar arrested

భారత రెజ్లర్‌, ఒలంపిక్ ప‌త‌క విజేత‌ సుశీల్‌ కుమార్‌ను ఢిల్లీ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. ఈ మే 4వ తేదీ రాత్రి ఢిల్లీలోని చత్రసాల స్టేడియం వద్ద జూనియర్‌ రెజ్లర్‌ సాగర్‌ రానాపై సుశీల్‌ కుమార్‌తో పాటు కొంత మంది రెజర్లు దాడి చేయడంతో.. తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలైన అత‌డు చికిత్స పొందుతూ మరణించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేయగా.. నిందితులు అప్ప‌టి నుండి ప‌రారీలో ఉన్నారు. సుశీల్‌ కుమార్‌పై ఢిల్లీ కోర్టు నాన్‌బెయిలబుల్‌ వారెంట్ కూడా జారీ చేసింది. అంతేకాదు.. ఆచూకీ తెలిపిన వారికి రూ. 1లక్ష బ‌హుమానం కూడా ప్ర‌క‌టించింది.

ఇదిలావుంటే.. సుశీల్‌ కుమార్‌ను ఢిల్లీ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. అత‌నితో పాటు ఆయ‌న‌ సన్నిహితుడు అజయ్ కుమార్‌ను ఎసీపీ అత్తర్‌ సింగ్ ఆద్వ‌ర్యంలోని ఇన్‌స్పెక్టర్లు శివకుమార్‌, కరంబీర్‌లతో కూడిన ప్రత్యేక సెల్‌.. ఢిల్లీలోని మండ్కా ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. కాగా, అజ‌య్ పై కూడా రూ. 50 వేలు రివార్డు ఉంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సుశీల్‌ కుమార్, అజయ్ కుమార్‌, ప్రిన్స్‌, సోను, సాగర్‌ రానా, అమిత్‌ల మధ్య గొడవ జ‌ర‌గ‌గా.. ఈ ఘర్షణలో సాగర్‌ రానాపై తీవ్రంగా దాడి చేయడంతో అత‌డు మరణించాడని పేర్కొన్నారు. అయితే.. నిందితులు పరారవ్వగా.. ఆదివారం వారిని పోలీసులు అరెస్టు చేశారు. ఇక ప‌రారీలో ఉన్న సుశీల్ కుమార్‌ ముందస్తు బెయిల్ పిటీష‌న్‌ను ఢిల్లీలోని రోహిణీ కోర్టు కొట్టివేసింది.





Next Story