సాధారణంగా కొంతమంది వారిలో ఉన్న నైపుణ్యాలను బయట పెడుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. అలాంటి వారి నైపుణ్యాన్ని గుర్తించి గిన్నిస్ బుక్ రికార్డులలో వారి పేరును సంపాదించుకుంటారు. అచ్చం ఇలాగే రెండేళ్ళ వయసులోనే ఓ బాలుడు గిన్నిస్ బుక్ రికార్డు సొంతం చేసుకున్నాడు. కానీ..ఆ బాలుడు 21 సంవత్సరాలు వచ్చేసరికి మృత్యువాత పడిన ఘటన రష్యాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
రష్యాకు చెందిన సుమో రెజ్లర్.. 2 ఏళ్ళ వయసులోనే ముప్పై నాలుగు కిలోల బరువు ఉండడంతో డిజాంబులట్ ఖోతాఖోవ్ 2003లో గిన్నిస్ బుక్ రికార్డుకెక్కాడు. ఆ తర్వాత కూడా సుమో రెజ్లర్ తన బరువును తగ్గకుండా అలాగే బరువు పెరుగుతూ మరోసారి 13 సంవత్సరాలలో ఏకంగా 180 కిలోల బరువు పెరిగి రికార్డు సృష్టించి మరొకసారి ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. బరువు విపరీతంగా పెరిగి పోవడంతో రికార్డులకు ఎక్కడంతో పాటు అనేక ఆరోగ్య సమస్యలు అతనిని చుట్టుముట్టాయి.
రెండేళ్ళ వయసులోనే గిన్నిస్ రికార్డును సొంతం చేసుకున్న సుమో రెజ్లర్ ఖోతాఖోవ్ 21 సంవత్సరంలో మృతి చెందినట్లు దక్షిణ కబర్డినో-బల్కారియా ప్రాంత సుమో రెజ్లింగ్ హెడ్ బేటల్ గుబ్‌జేవ్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలియజేశారు. అయితే అతని మృతికి సరైన కారణాలను మాత్రం వెల్లడించలేదు. అధిక బరువు పెరగటం వల్ల అనేక అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయని, కిడ్నీ సమస్యతోనే బాధపడుతూ ఖోతాఖోవ్ కన్నుమూసినట్లు తాజాగా రష్యన్ మీడియా తెలిపింది. అతి చిన్న వయసులోనే గిన్నిస్ రికార్డును సొంతం చేసుకున్న ఖోతాఖోవ్.. అతి చిన్న వయసులోనే మరణించడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రష్యాలోని ఉత్తర కాకాసస్ ప్రాంతం సహా కబార్డినో-బాల్కారియా, చెచెన్యా, ప్రాంతంలో రెజ్లింగ్ చాలా పాపులారిటీని సంపాదించారు.