వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ భారత్ చేరడానికి ఏమి జరగాలంటే..!

World Test Championship. టెస్ట్ ఛాంపియన్ షిప్ కోసం పలు దేశాలు పోటీ పడుతున్న సంగతి తెలిసిందే..!

By Medi Samrat  Published on  9 Feb 2021 3:52 PM GMT
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ భారత్ చేరడానికి ఏమి జరగాలంటే..!
టెస్ట్ ఛాంపియన్ షిప్ కోసం పలు దేశాలు పోటీ పడుతున్న సంగతి తెలిసిందే..! భారత్ కు చాలా అవకాశాలు ఉండగా.. తాజాగా ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోవడంతో భారత్ టెస్ట్ ఛాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరుకుంది. భారత్ పై 227 పరుగుల భారీ తేడాతో సాధించిన విజయం ఇంగ్లండ్ ను వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన నిలిపింది. చెన్నై టెస్టు ఓటమితో భారత్ ఈ పట్టికలో నాలుగోస్థానానికి పడిపోయింది.


ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్స్ చేరే అవకాశాలను ఇంగ్లండ్ మరింత మెరుగుపర్చుకుంది. భారత్ తో ఇంకా 3 టెస్టులు ఆడాల్సి ఉండగా, వాటిలో రెండు గెలిస్తే చాలని.. లార్డ్స్ వేదికగా జరిగే వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్స్ లో ఆడుతుంది. భారత్ కూడా ఈ సిరీస్ లో రెండు టెస్టులు గెలిస్తే టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్స్ బెర్తును ఖరారు చేసుకుంటుంది.

ఛాంపియ‌న్‌షిప్‌లో భాగంగా ఆరో సిరీస్ ఆడుతున్న ఇంగ్లండ్‌.. 11 విజ‌యాలు, 4 ఓట‌ములు, 3 డ్రాల‌తో మొత్తం 70.2 శాతం ప‌ర్సెంటేజీ పాయింట్ల‌తో అగ్ర స్థానంలో ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కూ టెస్టు చాంపియన్‌షిప్‌లో టాప్‌లో ఉన్న భారత్.. ఏకంగా నాలుగో స్థానానికి దిగ‌జారింది. ఆరో సిరీస్ ఆడుతున్న భారత్.. 9 గెలిచి, 4 ఓడి, ఒక‌టి డ్రా చేసుకుంది. మొత్తం 68.3 శాతం ప‌ర్సెంటేజీ పాయింట్ల‌తో నాలుగో స్థానంలో ఉంది. రెండు, మూడు స్థానాల్లో న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా జట్లు ఉన్నాయి. కరోనా నేపథ్యంలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య సిరీస్‌ వాయిదా పడడంతో వరల్డ్‌ టెస‍్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు అర్హత సాధించిన తొలి జట్టుగా న్యూజిలాండ్‌ నిలిచింది. ఆస్ట్రేలియాపై గెలిచిన ఉత్సాహం, సొంత‌గ‌డ్డ‌పై ఆడుతున్నామ‌న్న ఊపులో ఇంగ్లండ్‌పై గెలిచి కోహ్లీసేన క్వాలిఫై అవుతుంద‌ని భావించారు. కానీ అనూహ్యంగా తొలి టెస్ట్‌లోనే టీమిండియాకు భారీ షాక్‌ తగిలింది. టీమిండియా తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఓడినప్పటికి టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు అర్హత సాధించాలంటే ఈ సిరీస్‌ను టీమిండియా క‌నీసం 2-1 లేదా 3-1తో సిరీస్ గెల‌వాలి. ఇంగ్లండ్ క‌నీసం మూడు మ్యాచ్‌లు గెలిస్తే ఫైన‌ల్ వెళుతుంది.


Next Story