యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ విజేతగా ప్రపంచ నంబర్ వన్ పోలెండ్ క్రీడాకారిణి ఇగా స్వియాటెక్ నిలిచింది. భారత కాలమానం ప్రకారం శనివారం అర్థరాత్రి జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ట్యునీసియాకు చెందిన జాబెర్‌పై గెలిచింది. 52 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో 6-2,7-6(7-5) తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో మూడో గ్రాండ్ స్లామ్ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది పోలెండ్ భామ. ఇంతకముందు 2020, 2022 ఫ్రెంచ్ ఓపెన్ టైటిళ్లను సాధించింది.
ప్రపంచ మహిళా టెన్నిస్ లో గత రెండుదశాబ్దాలుగా ఓ వెలుగు వెలిగిన సెరెనా విలియమ్స్ లాంటి దిగ్గజాలు ఓ వైపు నిష్క్రమిస్తుంటుంటే.. మరోవైపు ఇగా స్వియాటెక్ లాంటి యువక్రీడాకారిణులు తెరమీదకు వస్తున్నారు. ఉక్రెయిన్‌కు మద్దతుగా స్వైటెక్ తన టోపిపై ప్రత్యేకమైన రిబ్బన్ ను ధరించి బరిలోకి దిగింది. ఆమె గత కొద్ది నెలలుగా అంతర్జాతీయ మ్యాచుల్లో ఇలాగే ఆడుతోంది.