టీమిండియా ఆటగాళ్లకు గుడ్‌న్యూస్ చెప్పిన బీసీసీఐ..!
వరుస విజయాలతో జోరుమీదున్న టీమిండియా ఆటగాళ్లకు బీసీసీఐ శుభవార్త చెప్పినట్లు తెలుస్తోంది.
By Srikanth Gundamalla Published on 21 Oct 2023 6:10 AM GMTటీమిండియా ఆటగాళ్లకు గుడ్‌న్యూస్ చెప్పిన బీసీసీఐ..!
భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్-2023 టోర్నీ కొనసాగుతోంది. ఈ టోర్నీలో భారత్ అదరగొడుతోంది. ఇప్పటి వరకు టీమిండియా ఆడిన నాలుగు మ్యాచుల్లోనూ దుమ్ము దులిపేసింది. వరుస విజయాలను అందుకుని హాట్ ఫేవరెట్‌గా మారింది. వరల్డ్ కప్-2023 పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. 4 విజయాలతోనే మెరుగైన రన్‌రేట్‌తో తొలి స్థానంలో ఉంది న్యూజిలాండ్. అయితే.. ఆదివారం న్యూజిలాండ్‌తో అమీతుమీ తేల్చుకునేందుకు భారత్ సిద్ధమవుతోంది. ఈ క్రమంలో వరుస విజయాలతో జోరుమీదున్న టీమిండియా ఆటగాళ్లకు బీసీసీఐ శుభవార్త చెప్పినట్లు తెలుస్తోంది.
భారత్ బ్యాటింగ్‌లో రోహిత్, గిల్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్ అదరగొడుతుండగా.. బౌలింగ్‌లో బుమ్రా, సిరాజ్, కుల్దీప్ యాదవ్, జడేజా ప్రత్యర్థుల పని పడుతున్నారు. అయితే.. టీమిండియా ఆటగాళ్లు విరామం లేకుండా మ్యాచులు ఆడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్లేయర్లకు కాస్త బ్రేక్ ఇవ్వాలని బీసీసీఐ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ధర్మశాల వేదికగా ఆదివారం న్యూజిలాండ్‌తో భారత్ మ్యాచ్ ఉంటుంది. ఇక ఆ తర్వాత మ్యాచ్ ఇంగ్లండ్‌తో అక్టోబర్ 29న ఉంటుంది. లక్నో వేదికగా ఈ మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ రెండు మ్యాచ్‌ల మధ్య వారం రోజుల గ్యాప్ ఉంటుంది. దాంతో.. ఓ మూడ్రోజుల పాటు టీమిండియా ఆటగాళ్లకు తమ కుటుంబ సభ్యులతో గడిపేందుకు అవకాశం ఇవ్వాలని బీసీసీఐ అనుమతిచ్చినట్లు సమాచారం అందుతోంది.
అయితే.. ఇదే విషయాన్ని బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు. సుదీర్ఘమైన ప్రపంచ షెడ్యూల్ కారణంగా టీమిండియా ప్లేయర్లకు విరామం దొరకడం లేదు. అదీకాక అంతకుముందు కూడా వరుసగా టోర్నీలో ఆడివచ్చారని చెప్పారు. న్యూజిలాండ్, ఇంగ్లండ్ మ్యాచ్‌ల మధ్య వారం రోజుల గ్యాప్ ఉండటంతో బ్రేక్ ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయించినట్లు సదురు అధికారి వెల్లడించారు.
ఆసియా కప్ నుంచి టీమిండియా ప్లేయర్లు వరుసగా మ్యాచ్‌లు ఆడుతున్నారు. తీరిక లేని షెడ్యూల్‌తో ఆటగాళ్లు అలసిపోతున్నారని బీసీసీఐ భావించింది. దాంతో.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇక మరోవైపు ఈ ప్రపంచకప్‌లో ఒక్కో మ్యాచ్.. ఒక్కో గ్రౌండ్లో ఆడుతున్న టీమ్ ఇండియా మాత్రమే. ప్రేక్షకుల ఆదరణను దృష్టిలో పెట్టుకుని ఒక్కో మ్యాచ్ ఒక్కో గ్రౌండ్లో ఆడేలా బీసీసీఐ ప్లాన్ చేసింది. ఈ నేపథ్యంలోనే 9 లీగ్ మ్యాచ్‌లను 9 చోట్ల ఆడనుంది టీమిండియా.