అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో మొదట టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో టీమిండియా మూడు మార్పులతో బరిలోకి దిగింది. వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్ భారత జట్టులోకి వచ్చారు. ఇప్పటికే మూడు వన్డేల సిరీస్ ను భారత్ 2-0తో కైవసం చేసుకున్న భారత్.. ఈ మ్యాచ్ లోనూ గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది. ఇంగ్లీష్ జట్టు మాత్రం ఈ ఆఖరి మ్యాచ్‌లోనైనా విజయం సాధించాలని అనుకుంటూ ఉంది.
ఈ మ్యాచ్ లో భారత్, ఇంగ్లండ్ ఆటగాళ్లు గ్రీన్ ఆర్మ్ బ్యాండ్స్ ధరించి కనిపించారు. బీసీసీఐ తలపెట్టిన 'డొనేట్ ఆర్గాన్స్, సేవ్ లైవ్స్'కు మద్దతుగా రెండు జట్లూ గ్రీన్ ఆర్మ్ బ్యాండ్‌లను ధరించాయి. ఐసిసి ఛైర్మన్ జే షా ఈ చొరవకు నాయకత్వం వహిస్తున్నారని బీసీసీఐ ఓ ప్రకటన విడుదల పేర్కొంది. అవయవదానంపై అవగాహన కల్పించడం కోసం బీసీసీఐ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఎంతో మంది అవయవదానం కోసం ఎదురుచూస్తూ ఉన్నారని, సరైన అవగాహన కల్పిస్తే తప్పకుండా చాలా ప్రాణాలను నిలబెట్టిన వాళ్ళము అవుతామని బీసీసీఐ తెలిపింది.