చైనాలో గుత్తా జ్వాల అమ్మమ్మ మరణం.. కానీ తిట్లు తింటోంది
'Where's the empathy', asks Jwala Gutta over 'racist replies' on social media post about demise of grandmother. కుటుంబ సభ్యులు చనిపోతే ఎంతో బాధ ఉంటుంది.
By Medi Samrat Published on 12 Feb 2021 12:26 PM GMTకుటుంబ సభ్యులు చనిపోతే ఎంతో బాధ ఉంటుంది. ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్, హైదరాబాదీ గుత్తా జ్వాల కుటుంబంలో కూడా అలాంటి విషాదమే నెలకొంది. గుత్తా జ్వాల అమ్మమ్మ చైనాలో మరణించింది. కానీ సామాజిక మాధ్యమాల్లో గుత్తా జ్వాలను.. గుత్తా జ్వాల కుటుంబ సభ్యులను తిడుతూ ఉన్నారు. గుత్తా జ్వాల తల్లి ఎలాన్ చైనా జాతీయురాలు. కొన్నిరోజుల కిందట ఎలాన్ తల్లి చైనాలో మరణించారు. తన అమ్మమ్మ కన్నుమూసిన విషయాన్ని జ్వాల సోషల్ మీడియా ద్వారా తెలిపారు. అమ్మమ్మ చనిపోయిన బాధలో తానుంటే, కొందరు జాతి వివక్ష వ్యాఖ్యలు చేయడం విస్మయం కలిగిస్తోందని జ్వాల ఆవేదన వ్యక్తం చేశారు.
This is what anyone will get...for any racist comment on my TL...and if you come near my family!! pic.twitter.com/S8Qd3qyaS4
— Gutta Jwala (@Guttajwala) February 12, 2021
తన అమ్మమ్మ మరణ వార్తను తెలుపుతూ "చైనీస్ న్యూ ఇయర్ రోజున అమ్మమ్మ మరణించింది. ఇంతకుముందు అమ్మ ప్రతి నెలా వెళ్లి అమ్మమ్మను చూసొచ్చేది. అయితే, కోవిడ్ కారణంగా ఏడాది నుంచి అమ్మ వెళ్లలేదు' అంటూ పేర్కొంది. దీనిపై కొందరు 'చైనీస్ వైరస్ అని అనకుండా కోవిడ్ అని ఎందుకు అంటున్నావు?' అంటూ జ్వాలను ప్రశ్నించడం మొదలెట్టారు. "ఓపక్క అమ్మమ్మ చనిపోయిన బాధలో మేం ఉంటే, చైనీస్ వైరస్ అని అనకుండా కోవిడ్ అంటున్నావేంటంటూ కొందరు ప్రశ్నించడం మరీ బాధగా వుంది. మనం బతుకుతున్నది సమాజంలోనేనా? అలాగైతే సానుభూతి ఎక్కడ? మనం ఎటువైపు పయనిస్తున్నాం?... సిగ్గుపడాల్సిన విషయం ఇది" అని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్-చైనా దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే..! చైనా మీద ఉన్న కోపాన్ని గుత్తా జ్వాల మీద.. ఆమె కుటుంబ సభ్యుల మీద చూపించడం ఏ మాత్రం భావ్యం కాదని కొందరు హితవు పలుకుతూ ఉన్నారు.