ప్రపంచకప్ మ్యాచ్‌లపై వాన మబ్బులు.. వాతావరణ శాఖ ఏం చెబుతుందంటే..
ఐసీసీ ప్రపంచకప్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అభిమానుల థ్రిల్ చెడిపోయే అవకాశం ఉంది.
By Medi Samrat Published on 1 Oct 2023 7:25 PM ISTఐసీసీ ప్రపంచకప్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అభిమానుల థ్రిల్ చెడిపోయే అవకాశం ఉంది. గత రెండు రోజుల్లో వర్షం కారణంగా మూడు మ్యాచ్‌లు రద్దయ్యాయి. భారత్ తొలి వార్మప్ మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దయింది. ఇలాంటి పరిస్థితుల్లో వరల్డ్‌కప్ మ్యాచ్‌ల్లోనూ ఇదే వాతావరణం ఉంటుందా అని చాలా మంది అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అభిమానులు మ్యాచ్‌ని ఆస్వాదించలేక వర్షం కారణంగా మ్యాచ్ వాష్ అవుతుందా.? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం.
సాధారణంగా భారతదేశంలో రుతుపవనాలు ముందుగానే వస్తాయి, కానీ ఈ సీజన్‌లో రుతుపవనాలు ఆలస్యంగా ప్రవేశించాయి. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఇప్పటికీ వర్షాల ప్రభావం కనిపించడానికి ఇదే కారణం. అటువంటి పరిస్థితితులలో వాతావరణ శాఖ వివరాల ప్రకారం.. దేశంలో వర్షాల ప్రభావం అక్టోబర్, నవంబర్ నెలల్లో కూడా చూడవచ్చని తెలుస్తుంది. ఇదే జరిగితే వరల్డ్ కప్ మ్యాచ్‌లకు వర్షం అడ్డుకట్ట వేయడం ఖాయం. అయితే.. వాతావరణ శాఖ సహాయక సమాచారం ప్రకారం.. అక్టోబర్ 3 నుండి 5 తర్వాత వర్షాల ప్రభావం తగ్గుతుందని తెలుస్తుంది. దీంతో అభిమానులకు కాస్త ఊరట లభించినట్టే.
ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచకప్‌లో కొన్ని మ్యాచ్‌లకు మాత్రమే వర్షం ముప్పు ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. చాలా మ్యాచ్‌లు ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. లీగ్ మ్యాచ్‌లకు రిజర్వ్ డే ఉంచకపోవడం ఖచ్చితంగా ఆందోళన కలిగించే విషయమే. లీగ్ మ్యాచ్‌లలో ఏదైనా మ్యాచ్ రద్దైతే.. ఇరు జట్లకు ఒక్కో పాయింట్ ఇవ్వబడుతుంది. సెమీ-ఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లకు మాత్రమే ఐసిసి రిజర్వ్ డే ఉంచింది. ప్రపంచ కప్ తేదీని నిర్ణయించేటప్పుడు.. ICC వర్షం ఎప్పుడు, ఎక్కడ సంభవించవచ్చో పరిశీలించింది. దీంతో ఎక్కువగా ప్రపంచకప్ మ్యాచ్‌లకు వర్షం ముప్పు ఉండదని భావిస్తున్నారు.