భారత క్రికెట్ లో ఇంతకూ ఏమి జరుగుతోంది
What happens in Indian cricket team.ఎన్నడూ లేని విధంగా గత కొన్ని రోజులుగా "భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు" మీద చాలా
By M.S.R Published on 13 Dec 2021 2:45 PM GMTఎన్నడూ లేని విధంగా గత కొన్ని రోజులుగా "భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు" మీద చాలా రకాల వదంతులు వస్తున్నాయ్. దీనికి ముఖ్య కారణం విరాట్ కోహ్లిని వన్డే కెప్టెన్ గా తొలగించి.. అతడి స్థానంలో ఓపెనర్ "రోహిత్ శర్మ" ను ఎంపిక చేయడం. దీని గురించి చాలా పుకార్ల తర్వాత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తన మనసులో మాట బయట పెట్టారు.
కోహ్లీ మూడు నెలల కిందటే టి20 కెప్టెన్ గా వైదొలుగుతున్నానని బీసీసీఐకి చెప్పాడు. గంగూలీ కోహ్లీని వ్యక్తిగతంగా కలిసి టీ20కెప్టెన్ గా కొనసాగాలని కోరారు. కానీ కోహ్లీ పని భారం కారణంగా కెప్టెన్ గా దిగిపోతున్నా అని సున్నితంగా గంగూలీ మాటలను తిరస్కరించాడు. బీసీసీఐ సెలక్షన్ కమిటీ సమావేశంలో వైట్ బాల్ క్రికెట్ లో ఇద్దరు వేరు వేరు కెప్టెన్ లు ఉండటం మంచిది కాదని వన్డే కెప్టెన్ గా కూడా బాధ్యతలు రోహిత్ శర్మకే అప్పగించారు. రోహిత్ శర్మ న్యూజిలాండ్ తో గత నెలలో జరిగిన 3 టీ20 ల సీరీస్ తో టీ20 కెప్టెన్ గా పూర్తి స్థాయి నాయకత్వ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే.
ఈ నెలలో సౌత్ ఆఫ్రికా పర్యటన కోసం టెస్ట్ మరియు వన్డే జట్లను బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకటించింది. ఇందులో అనూహ్యంగా వన్డే కెప్టెన్ గా రోహిత్ శర్మ పేరును ఖరారు చేయడం విరాట్ కోహ్లి అభిమానులకు అసలు మింగుడు పడని విషయం. కోహ్లీ వన్డే కెప్టెన్ గా కొనసాగుతాను అని చెప్పినా కూడా బీసీసీఐ కోహ్లీని తప్పించడం సరికాదని తీవ్ర నిరాశకు లోనయ్యారు కోహ్లీ అభిమానులు. ఇక వన్డే కెప్టెన్ గా నియమించబడిన రోహిత్ శర్మ బీసీసీఐ టీవీ కి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ "బయట జనాలు ఏమి మాట్లాడుతున్నారు, ఎలాంటి విమర్శలు చేస్తున్నారు అనేది నేను పట్టించుకోను అని, నాకు ఒక జట్టుగా అందరి ఆటగాళ్లతో కలిసి మెలసి ఉండటమే కెప్టెన్ గా నా కర్తవ్యం అని తెలిపాడు. అందరూ సమిష్టిగా పోరాడితేనే విజయాలు దక్కుతాయి.. అందరూ కలిసి కట్టుగా ఆడితేనే ఆటగాళ్లలో నమ్మకం పెరుగుతుంది, బాధ్యత పెరుగుతుందని చెప్పుకొచ్చాడు. ఇంకా ముఖ్యంగా ఆటగాళ్ళ మధ్య సమన్వయo ఏర్పడుతుంది అని రోహిత్ శర్మ తెలిపాడు.
భారత జట్టు సౌత్ ఆఫ్రికా పర్యటన లో భాగంగా 3 టెస్ట్ మ్యాచ్ లు, 3 వన్డే మ్యాచ్ లు ఆడనుంది. 4 టి 20 లు కూడా ఆడాల్సి ఉన్నా ప్రస్తుతానికి కేవలం టెస్ట్ లు, వన్డే లు ఆడి పర్యటన ముగించే అవకాశాలు ఉన్నాయి. కోహ్లీ కే కాకుండా టెస్ట్ జట్టు వైస్ కెప్టెన్ గా ఉన్న అజింక్య రహానేను కూడా తప్పించి ఆ బాధ్యత ను రోహిత్ శర్మ కు అప్పగించింది బీసీసీఐ. గత ఏడాదిగా రహానే ఆట తీరు పేలవంగా ఉండటం వల్ల జట్టుకు భారంగా మారాడు. చివరి అవకాశంగా రహానే ను సౌత్ ఆఫ్రికా పర్యటనకు బీసీసీఐ ఎంపిక చేసింది.
కేవలం బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, బీసీసీఐ సెక్రెటరీ జై షా అనాలోచిత నిర్ణయాల కారణంగా కోహ్లీ వన్డే కెప్టెన్సీ కోల్పోయాడనేది విరాట్ కోహ్లి అభిమానుల వాదన.