ఇక మేము భారత్‌లో అడుగుపెట్టము

ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యం ఇవ్వడంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఎంతో క్లారిటీతో ఉందని పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ స్పష్టం చేశారు.

By అంజి  Published on  28 Nov 2024 12:19 PM IST
India, Pakistan Cricket Board, ICC

ఇక మేము భారత్‌లో అడుగుపెట్టము

ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యం ఇవ్వడంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఎంతో క్లారిటీతో ఉందని పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ స్పష్టం చేశారు. భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్థాన్ లో అడుగుపెట్టకపోతే, పాకిస్తాన్ భారతదేశంలో ఆడటం సాధ్యం కాదని తేల్చి చెప్పారు.

గడ్డాఫీ స్టేడియంలో జరిగిన విలేకరుల సమావేశంలో నఖ్వీ మాట్లాడుతూ 'పాకిస్థాన్ క్రికెట్‌కు ఏది ఉత్తమమో అది చేస్తామని నేను హామీ ఇస్తున్నాను. నేను ICC ఛైర్మన్‌తో నిరంతరం టచ్‌లో ఉన్నాను. నా బృందం వారితో నిరంతరం మాట్లాడుతోంది. మేము భారతదేశంలో క్రికెట్ ఆడటం ఆమోదయోగ్యం కాదు. వారు ఇక్కడ క్రికెట్ ఆడకపోతే మేము ఇప్పటికీ మా వైఖరిలో స్పష్టంగా ఉన్నాము. ఏది జరిగినా సమానత్వం ఆధారంగానే జరుగుతుంది. మేము ICCకి చాలా స్పష్టంగా చెప్పాము. తరువాత ఏమి జరుగుతుందో మేము మీకు తెలియజేస్తాము.' అంటూ చెప్పుకొచ్చారు.

ఛాంపియన్స్ ట్రోఫీ వచ్చే ఏడాది ఫిబ్రవరి- మార్చిలో పాకిస్తాన్‌లోని మూడు వేదికలలో నిర్వహించనున్నారు. అయితే 2008 నుంచి పాకిస్థాన్‌లో భారత్ పర్యటించలేదు. ఈ నెల ప్రారంభంలో జరిగే ఈవెంట్ కోసం పాకిస్థాన్ వెళ్లేందుకు తమ ప్రభుత్వం తమకు అనుమతి ఇవ్వలేదని బీసీసీఐ ఐసీసీకి తెలిపింది. పాకిస్థాన్ లో భారత క్రికెట్ జట్టు అడుగుపెట్టే అవకాశాలు దాదాపు శూన్యం.

Next Story