రవి బిష్ణోయ్ పై రోహిత్ ప్రసంశల వర్షం
We see something different in Ravi Bishnoi says Rohit.మూడు వన్డేల సిరీస్‌లో ప్రత్యర్థిని చిత్తు చేసిన టీమ్ఇండియా
By తోట వంశీ కుమార్ Published on 17 Feb 2022 12:57 PM ISTమూడు వన్డేల సిరీస్‌లో ప్రత్యర్థిని చిత్తు చేసిన టీమ్ఇండియా టీ20 సిరీస్‌ను దూకుడుగా ఆరంభించింది. కోల్‌కతా వేదికగా జరిగిన తొలి టీ20లో తొలుత బంతితో ఆపై బ్యాటుతో ఆధిపత్యం చలాయించిన రోహిత్ సేన విండీస్‌ను అలవోకగా ఓడించింది. అరంగ్రేట మ్యాచ్‌లో అదరగొట్టిన యువ స్పిన్నర్ రవి బిష్ణోయ్ (2/14)కు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు లబించింది. మూడు టీ20ల సిరీస్‌లో టీమ్ఇండియా ప్రస్తుతం 1-0 ఆధిక్యంలో ఉంది. రెండో టీ20 శుక్రవారం జరగనుంది.
తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది.నికోలస్ పూరన్ (43 బంతుల్లో 61; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) అర్ధ సెంచరీ సాధించగా.. కైల్ మేయర్స్ (24 బంతుల్లో 31; 7 ఫోర్లు) కెప్టెన్ పొలార్డ్ (24 నాటౌట్; 2 ఫోర్లు, ఒక సిక్సర్) ఫర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో రవి బిష్ణోయ్, హర్షల్ పటేల్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం భారత్ 18.5 ఓవర్లలో 4 వికెట్లకు 162 పరుగులు చేసి గెలిచింది. రోహిత్ శర్మ (19 బంతుల్లో 40; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), ఇషాన్ కిషన్ (42 బంతుల్లో 35; 4 ఫోర్లు), సూర్యకుమార్ యాదవ్ (18 బంతుల్లో 34 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు.
ఇక మ్యాచ్ అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ.. బిష్ణోయ్ బౌలింగ్‌ను మెచ్చుకున్నాడు. బిష్ణోయ్ నైపుణ్యం ఉన్న ఆటగాడని.. అందుకే తొలి టీ20లోనే అతడిని నేరుగా తుది జట్టులోకి తీసుకున్నట్లు చెప్పాడు. అతడు వేరియేషన్స్‌తో పాటు ఏ సమయంలోనైనా బౌలింగ్ చేసే సత్తా ఉందన్నాడు. దీంతో మేం ఇతర బౌలర్లను కూడా బాగా ఉపయోగించుకునే అవకాశం లభిస్తుంది. అరంగ్రేటం మ్యాచ్‌లోనే రాణించడం చాలా సంతోషంగా ఉంది. అతడికి మంచి భవిష్యత్ ఉంది. అతడిని ఎలా ఉపయోగించుకుంటామనేది మా చేతుల్లోనే ఉందని రోహిత్ అన్నాడు.
ఇషాన్ కిషన్ బ్యాటింగ్‌పై స్పందిస్తూ.. మధ్య ఓవర్లలో ఎలా బ్యాటింగ్ చేయాలనే దానిపై కొన్ని రోజులుగా ఇషాన్‌తో చర్చిస్తున్నట్లు రోహిత్ చెప్పాడు. స్లో పిచ్‌పై అతడు పరుగులు చేసేందుకు ఇబ్బందులు పడుతున్నాడని, ప్రస్తుతం అతడు తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్లు తెలిపాడు. అతడికి ఇంకాస్త సమయం ఇవ్వాలని.. అతడు బరిలోకి దిగినప్పుడల్లా ప్రశాంతంగా ఆడే పరిస్థితులు కల్పించాల్సిన అవసరం ఉందని రోహిత్ అన్నాడు.