పంత్ బ్యాటింగ్ శైలిపై గవాస్కర్ ఆందోళన
We are changing our views and opinions about Rishabh Pant.టీమ్ఇండియా వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్
By తోట వంశీ కుమార్ Published on 2 Feb 2022 4:22 PM IST
టీమ్ఇండియా వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ బ్యాటింగ్ శైలిపై క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఆందోళన వ్యక్తం చేశారు. రిషబ్‌పంత్‌లో గొప్ప టాలెంట్ ఉందన్నారు. అయితే.. నిర్లక్ష్యపు షాట్లతో వికెట్ పారేసుకుంటూ తరచూ విమర్శల పాలవుతున్నాడన్నారు. పంత్ కాస్త సంయమనంతో ఆడితే టీమ్ఇండియాకు ఎంతో మేలు చేకూరుతుందని గవాస్కర్ అభిప్రాయపడ్డారు.
రిషబ్ పంత్ సత్తా ఏంటో అందరికీ తెలుసు. అయితే.. రోజు రోజుకి అతడి బ్యాటింగ్ పై ఉన్న మన అభిప్రాయాలు మారిపోతున్నాయి. ఓ మ్యాచ్‌లో దారుణంగా విఫలం అయితే.. మరో మ్యాచ్‌లో అద్భుతమైన బ్యాటింగ్‌తో అలరిస్తున్నాడు. గతేడాది ఆస్ట్రేలియా పర్యటనలో అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడాడు. ముఖ్యంగా సిడ్ని టెస్టులో 96, బ్రిస్బేన్ టెస్టులో 89 పరుగులు చేశారు. పంత్ కాస్త సంయమనంతో ఆడితే బాగుంటుంది.
క్రీజులోకి వచ్చిన తొలి 10 బంతుల్లో అతడు పరుగులేమీ చేయకున్నా ఏమీ కాదు. ఎందుకంటే తరువాతి నాలుగు బంతుల్లో 16 బంతులు చేయగల సత్తా అతడికి ఉంది. అందుకనే ఈ విషయం గురించి కోచ్ రాహుల్ ద్రావిడ్.. పంత్‌తో మాట్లాడాలి. నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేయడం జట్టు విజయానికి ఎంత కీలకమో అతడికి వివరించాలి. అతడు 300 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేయాల్సిన అవసరం లేదు. పరిస్థితులకు తగ్గట్లుగా రాణిస్తే చాలు. సంయమనంతో ఆడితే జట్టుకు ఎంతో మేలు జరుగుందని సునీల్ గవాస్కర్ అన్నారు.