జాతీయ క్రికెట్ అకాడ‌మీ డైరెక్ట‌ర్‌గా వీవీఎస్ ల‌క్ష్మ‌ణ్‌.. అప్పుడే బాధ్యతలు

VVS Laxman Agrees To Take Over As The New NCA Head Coach. వీవీఎస్‌ లక్ష్మణ్‌ జాతీయ క్రికెట్‌ అకాడమీ డైరెక్టర్‌గా నియామకం కానున్నారు. ఈ నియామకాన్ని బీసీసీఐ అధ్యక్షుడు

By అంజి  Published on  14 Nov 2021 2:00 PM IST
జాతీయ క్రికెట్ అకాడ‌మీ డైరెక్ట‌ర్‌గా వీవీఎస్ ల‌క్ష్మ‌ణ్‌.. అప్పుడే బాధ్యతలు

వీవీఎస్‌ లక్ష్మణ్‌ జాతీయ క్రికెట్‌ అకాడమీ డైరెక్టర్‌గా నియామకం కానున్నారు. ఈ నియామకాన్ని బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ అధికారికంగా ధృవీకరించారు. జాతీయ క్రికెట్‌ అకాడమీ డైరెక్టర్‌గా వీవీఎస్‌ లక్ష్మణ్‌ త్వరలోనే బాధ్యతలు స్వీకరిస్తారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా గంగూలీ మాట్లాడుతూ.. భారత్‌లో క్రికెట్‌ను మరింత అభివృద్ధి చేసేందుకు మాజీ క్రికెటర్లను భాగస్వామ్యం చేయాల్సి అవసరం ఉందని పేర్కొన్నారు. భారత జట్టు ప్రధాన కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌ను ఉండేలా గంగూలీ అంగీకరించిన విషయం తెలిసిందే. వీవీఎస్‌ లక్ష్మణ్‌ ఎన్‌సీఏ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టాలని గంగూలీ ఆకాంక్షించారు. బీసీసీఐ సెక్రటరీ జై షా, ఇతర అధికారులు కూడా వీవీఎస్‌ లక్ష్మన్‌ జాతీయ క్రికెట్‌ అకాడమీ హెడ్‌గా బాధ్యతలు చేపట్టాలని కోరారు. కాగా ఈ నెలాఖరులో జరిగే దక్షిణాఫ్రికా పర్యటన తర్వాత లక్ష్మణ్ బాధ్యతలు చేపట్టనున్నట్లు ఓ జాతీయ దినపత్రిక కథనం ద్వారా తెలిసింది.

Next Story