ఆసమయంలో థర్డ్ అంపైర్ కళ్లకు గంతలు.. సూర్య ఔట్‌పై సెహ్వాగ్
Virender Sehwag criticise on skys controvercial dismissal.సూర్య ఔట్‌పై భారత మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ తనదైన శైలిలో స్పందించాడు.
By తోట వంశీ కుమార్ Published on 19 March 2021 11:16 AM ISTఅహ్మదాబాద్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగో టీ20లో సూర్యకుమార్ యాదవ్(57; 31బంతుల్లో 6పోర్లు, 3 సిక్సర్లు) వివాదాస్పద రీతిలో ఔటైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ ఔట్ విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సూర్య ఔట్‌పై భారత మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ తనదైన శైలిలో స్పందించాడు. ఓ ఫోటోను షేర్ చేశాడు. అందులో ఓ చిన్నపిల్లాడు కళ్లకు గంతలు కట్టుకుని ఉండగా.. మరోపక్కన డేవిడ్ మలాన్ క్యాచ్ అందుకున్న ఫోటోను పెట్టాడు. సూర్య ఔట్ విషయంలో థర్డ్ అంపైర్ ఇలా కళ్లుమూసుకుని ఉన్నాడని వ్యంగ్యంగా విమర్శించాడు. ప్రస్తుతం సెహ్వాగ్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అసలేం జరిగిందంటే..?
భారత ఇన్నింగ్స్ 13.2 ఓవర్‌లో సామ్‌కరన్ వేసిన బంతిని సూర్యకుమార్ షాట్ ఆడగా.. మలన్ క్యాచ్ అందుకున్నాడు. అయితే.. బంతి నేలను తాకున్నట్లు కనిపించినా ఆన్‌పీల్డ్ అంపైర్ ఔట్ ఇచ్చాడు. రీప్లేలో బంతి నేలకు తాకుతున్నట్లు కనిపించడంతో థర్ఢ్ అంపైర్ దృష్టికి వెళ్లింది. దాన్ని అనుమానాస్పదంగా భావించిన థర్డ్ అంపైర్.. అంఫైర్స్ కాల్‌గా ప్రకటిస్తూ ఔటిచ్చారు. దీనిపై ఇటు మాజీలతో పాటు అటు నెటీజన్లు తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేశారు.
Third umpire while making that decision. #INDvENGt20 #suryakumar pic.twitter.com/JJp2NldcI8
— Virender Sehwag (@virendersehwag) March 18, 2021
ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. సూర్య కుమార్ 57, పంత్ 30, అయ్యర్ 37 పరుగులతో రాణించారు. 186 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 8వికెట్లు కోల్పోయి 177 పరుగులు మాత్రమే చేసింది. దీంతో భారత్ 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో 5 టీ20ల సిరీస్‌ను 2-2తో సమం చేసింది. ఇక ఇరు జట్ల మధ్య ఆఖరి టీ20 శనివారం జరగనుంది. ఆ మ్యాచ్‌లో ఎవరు గెలిస్తే వారే టీ20 సిరీస్ విజేతగా నిలవనున్నారు.