పంత్‌కు కోహ్లీ వార్నింగ్‌.. నాకింకా చాలా మంది కీప‌ర్లు ఉన్నారు

Virat Kohli's Banter With Pant.ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్‌) ముగిసింది. ఇప్పుడు అంద‌రి దృష్టి టీ 20 ప్ర‌పంచ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  16 Oct 2021 9:13 AM GMT
పంత్‌కు కోహ్లీ వార్నింగ్‌.. నాకింకా చాలా మంది కీప‌ర్లు ఉన్నారు

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్‌) ముగిసింది. ఇప్పుడు అంద‌రి దృష్టి టీ 20 ప్ర‌పంచ క‌ప్‌పై ప‌డింది. ఇక భారత ఆట‌గాళ్లు కూడా ప్ర‌పంచ‌క‌ప్‌పై దృష్టి సారించారు. ఈ క్ర‌మంలో టీ 20ల్లో సిక్స‌ర్లే మ్యాచ్‌ల‌ను గెలిపిస్తాయ‌ని కెప్టెన్ విరాట్ కోహ్లీ.. పంత్‌తో అన్నాడు. ధ‌నాధ‌న్ బ్యాటింగ్‌తో జ‌ట్టును విజ‌య‌తీరాల‌కు కోరాడు. లేదంటే త‌న‌కు చాలా మంది వికెట్ కీప‌ర్లు ఉన్నార‌ని పంత్‌ని కోహ్లీ హెచ్చ‌రించాడు. దీనిపై పంత్ స్పందిస్తూ.. ధ‌నాధ‌న్ బ్యాటింగ్‌తో ఆక‌ట్టుకునేందుకే తాను స‌న్న‌ద్దం అవుతున్న‌ట్లు చెప్పాడు.

రేప‌టి నుంచి(అక్టోబ‌ర్ 17) పొట్టి ప్ర‌పంచ‌క‌ప్ ఆరంభం కానుంది. ఈ నేప‌థ్యంలో టోర్ని ప్ర‌సార హ‌క్కుల‌ను ద‌క్కించుకున్న స్టార్‌స్పోర్ట్స్ 'స్కిప్పర్ కాలింగ్ కీపర్' పేరుతో ఓ ఫ‌న్నీ యాడ్‌ను రూపొందించింది. అందులోనే పంత్, కోహ్లీల మ‌ధ్య ఈ సంబాష‌ణ చోటు చేసుకుంది.

Advertisement

ఆ యాడ్‌లో ఏముందంటే..? పంత్ కు కోహ్లీ కాల్ చేస్తాడు. టీ20 మ్యాచ్ లను సిక్సర్లే గెలిపిస్తాయంటూ పంత్ కు కోహ్లీ చెబుతాడు. దానికి పంత్.. బెంగ వద్దని తాను రోజూ ప్రాక్టీస్ చేస్తున్నానని చెబుతాడు. సిక్స‌ర్ కొట్టి భార‌త్‌కు వ‌ర‌ల్డ్ క‌ప్ తెచ్చిపెట్టింది కీప‌రే క‌దా అని అంటాడు. ఇందుకు కోహ్లీ.. అది నిజ‌మే కానీ.. నువ్వు ధోని భాయ్ కాదు. మ‌హీ త‌రువాత అలాంటి కీప‌ర్ ఇంకా దొర‌క‌లేదు అంటూ కౌంట‌ర్ ఇచ్చాడు. ఇందుకు పంత్‌.. నేను కూడా కీప‌ర్‌నే క‌దా అంటాడు. తన దగ్గర చాలా మంది కీపర్లున్నారని, వార్మప్ మ్యాచ్ లలో ఎవరు నిరూపించుకుంటారో చూద్దామంటూ కోహ్లీ సవాల్ విసిరాడు. కాగా.. ఇది జస్ట్ పార్ట్ 1 మాత్రమేనని.. త్వరలోనే సెకండ్ పార్ట్ వస్తుందని ప్ర‌సార‌దారు స్టార్ స్పోర్ట్స్ ఆ వీడియోకు పోస్ట్ జత చేసింది.

ఈ నెల 17న ప్ర‌పంచ క‌ప్ ప్రారంభం అవుతుండ‌గా.. భార‌త్ 18,20వ తేదీల్లో ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా జ‌ట్ల‌తో వార్మ‌ప్ మ్యాచ్‌లు ఆడ‌నుంది. ఇక త‌న తొలి మ్యాచ్‌ను 24న చిర‌కాల ప్ర‌త్య‌ర్థి పాకిస్థాన్‌తో త‌ల‌ప‌డ‌నుంది.

Next Story
Share it